Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రీల్ పెద్ది వెనుక రియల్ పెద్ది

రీల్ పెద్ది వెనుక రియల్ పెద్ది

Gulte.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పెద్ది మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొన్ని నెలలుగా డ్రై రన్ నడుస్తున్న సమయంలో ఈ సినిమా రిలీజవుతుండడంతో దీని కోసం ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. చిత్ర బృందంలోని ఒక్కొక్కరు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ మీడియాను కలిసి విశేషాలను పంచుకున్నారు. ఇప్పుడు ఏకంగా దర్శకుడు బుచ్చిబాబే రంగంలోకి దిగాడు. తన ఇంటర్వ్యూలు సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేస్తున్నాయి. సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను అతను వెల్లడిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెద్ది పాత్రకు స్ఫూర్తి తన ఊరికి చెందిన కుర్రాడే అంటూ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడు బుచ్చిబాబు.

బుచ్చిబాబు ఊరిలో పెద్ది రాజు అనే కుర్రాడు ఉండేవాడట. అతను కూలి పనికి వెళ్లేవాడట. ఐతే అతను క్రికెట్, వాలీబాల్ సూపర్‌గా ఆడేవాడని.. పని మాన్పించి మరీ అతడితో మ్యాచ్‌లు ఆడించేవాళ్లమని.. అందుకోసం డబ్బులు కూడా ఇచ్చేవాళ్లమని బుచ్చిబాబు వెల్లడించాడు. అతను ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించేవాడని.. తనను చూసినపుడల్లా ఈ క్యారెక్టర్ భలే ఉందే అనిపించేదని.. తన స్ఫూర్తితోనే పెద్ది పాత్రను క్రియేట్ చేసి, ఈ కథ రాశానని బుచ్చిబాబు వెల్లడించాడు.

తన గురువు సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఒక గుడిలో కూర్చుని ఈ కథ పూర్తి చేశానని.. ఈ కథకు రామ్ చరణ్ ఏ కరెక్షన్ చెప్పకుండా ఒప్పుకోవాలని అక్కడ మొక్కుకున్నానని.. తాను కోరుకున్నట్లే చరణ్ ఏ చిన్న మార్పు చెప్పకుండా ఈ కథను ఓకే చేశాడని బుచ్చిబాబు తెలిపాడు. ఇక సినిమాలో రామ్ చరణ్ బెల్లం ఫ్యాక్టరీలో పని చేసే కుర్రాడిగా కనిపిస్తాడని.. తన పెర్ఫామెన్స్ వేరే లెవెల్లో ఉంటుందని.. మళ్లీ అతను ఇలాంటి కథలో నటించడం కష్టమని, తాను కూడా ఇంత మంచి కథ రాయలేనని బుచ్చిబాబు చెప్పడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu