Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సనాతనం'పై ఉదయనిధికి సీనియర్ హీరో కౌంటర్

'సనాతనం'పై ఉదయనిధికి సీనియర్ హీరో కౌంటర్

Gulte.com 3 weeks ago

నాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి. సనాతన ధర్మం ఒక మలేరియా లాంటిదని..

దాన్ని నిర్మూలించడమే తన లక్ష్యమని డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.

ఐతే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఉదయనిధి తీరు మారలేదు. మరోసారి సనాతన ధర్మం గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఐతే తమిళనాట హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నా, హిందుత్వం బలంగా ఉన్నా సరే.. ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించిన నాయకులు తక్కువ.

ముఖ్యంగా సినిమా వాళ్లెవ్వరూ ఆ వ్యాఖ్యలను ఖండించింది లేదు. ఐతే ఇప్పుడు ఉదయనిధి ప్రతిపక్షంలో ఉండగా.. సీనియర్ హీరో అర్జున్ సనాతనం మీద ఉదయనిధి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అర్జున్‌కు దైవభక్తి ఎక్కువ. హిందూ ధర్మం గురించి ఎప్పుడూ గొప్పగా మాట్లాడుతుంటారు.

తన ప్రాంతంలో భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారాయన. తన కొత్త సినిమా 'బ్లాస్ట్' రిలీజ్ నేపథ్యంలో మీడియాను కలిసిన ఆయనకు సనాతన ధర్మం గురించి ఉదయనిధి పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడం గురించి ప్రశ్న ఎదురైంది.

దీనిపై ఆయన స్పందిస్తూ.. ''సనాతన ధర్మం అన్నది మతానికి సంబంధించిన విషయం కాదు. సనాతనం అన్నది జీవన విధానం. అది మనిషి ఎలా బతకాలో చెబుతుంది. నువ్వు నీ కష్టాన్ని నమ్ముకో, నీతిగా బతుకు, వేరే వాళ్ల సొమ్ముకు ఆశపడకు అని సనాతన ధర్మం అంటుంది.

మనల్ని పిల్లలుగా ఉన్నపుడు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, వాళ్లు ముసలివాళ్లయ్యాక వారిని మనం బాగా చూసుకోవాలని సనాతనం సూచిస్తుంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటే.. తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటికి తోసేయాలి అని చెబుతున్నట్లు. నాకు అర్థమైన మేర నేను చెబుతున్నా'' అని అర్జున్ పేర్కొన్నాడు. ఇప్పటికైనా సినీ రంగం నుంచి ఒక్కరైనా ఉదయనిధి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారంటూ అర్జున్ మీద తమిళులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu