Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సస్పెన్సుకు తెరదించబోతున్న రామ్

సస్పెన్సుకు తెరదించబోతున్న రామ్

Gulte.com 1 week ago

టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడైన రామ్.. ఒకప్పుడు నిలకడగా విజయాలు అందుకునేవాడు. కానీ కొన్నేళ్లుగా అతడికి అస్సలు కలిసి రావడం లేదు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత వరుసగా పరాజయాలు అందుకున్నాడు.

గత ఏడాది వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా విషయంలో రామ్ ఎంత తపన పడ్డాడో తెలిసిందే. తన మాస్ ఇమేజ్ అంతా పక్కన పెట్టి ఒక స్టార్ హీరోను ఆరాధించే వీరాభిమాని పాత్రలో ఒదిగిపోయాడు.

ఈ సినిమా కోసం అతను సొంతంగా ఒక పాట కూడా రాశాడు. కొంత వరకు రైటింగ్‌లో కూడా ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే 'ఆంధ్ర కింగ్ తాలూకా' పాజిటివ్ రివ్యూలు, టాక్ తెచ్చుకుని కూడా సరిగా ఆడలేదు. తన ఖాతాలో మరో ఫ్లాప్ జమ కావడంతో రామ్ బాగా డిజప్పాయింట్ అయ్యాడు. అందుకే కొత్త సినిమా విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు.

వేరే వాళ్లు రాసిన కథలు తనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో రామ్ ఈసారి తనే సొంతంగా కథ రాసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని డీల్ చేసే డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడని.. డైరెక్షన్ కూడా తనే చేయాలనుకుంటున్నాడని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.ఐతే రామ్ కొత్త సినిమా విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు రామ్ సస్పెన్సుకు తెరదించాలని నిర్ణయించుకున్నాడు.

శుక్రవారమే రామ్ కొత్త సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది. దానికి ముందు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో రామ్ టీజ్ చేశాడు. అందులో ఒక వ్యక్తి చేతిలో మైక్ ఉంది. అది రక్తంతో తడిసి ఉంది. ఈ పోస్టర్ మీద దర్శక నిర్మాతల వివరాలేమీ లేవు. నేరుగా శుక్రవారం ఉదయమే అన్ని వివరాలు, విశేషాలు పంచుకోబోతున్నాడు. పోస్టర్ చూస్తే ఇది వయొలెంట్ సినిమా అనే సంకేతాలు కలుగుతున్నాయి.

కానీ కత్తితో పాటు రక్తం ఉంటే పక్కా వయొలెంట్ మూవీ అనుకోవచ్చు. కానీ హీరో చేతిలో ఉన్నది కావడంతో కాన్సెప్ట్ విషయంలో ట్విస్ట్ ఉంటుందేమో చూడాలి. ఐతే ఎలాంటి కథ ఎంచుకున్నప్పటికీ.. ఈసారి రామ్ హిట్టు కొట్టి తీరాల్సిందే. లేదంటే ఇప్పటికే బాగా డౌన్ అయిన మార్కెట్ మరింత కిందికి వెళ్లిపోవడం ఖాయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu