Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్

సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్

Gulte.com 1 week ago

సినీ తారలు, సెలబ్రిటీలు, వీఐపీలు, అధికారులు క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్న సందర్భంలో వారిలో కొంతమంది ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోరు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ ఔరా అనిపించిన వారు చాలామంది ఉన్నారు.

తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేరారు. హెచ్ సీఏ సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో సీవీ ఆనంద్ సెంచరీతో చెలరేగారు.

58 సంవత్సరాల వయసులో సీవీ ఆనంద్ దూకుడు చూసిన నెటిజన్లు షాకయ్యారు. 82 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆనంద్ హైదరాబాద్ జట్టుపై సెంచరీ బాదారు.

బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డ ఆనంద్ అజేయంగా 126 పరుగులు చేశారు. అంతేకాదు, 5 ఓవర్లు బౌలింగ్ వేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించి ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఆనంద్ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్ల సికింద్రాబాద్ క్లబ్ జట్టు 39 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆనంద్ సెంచరీకి తోడు జంషీద్‌ (77), సంజీవ్‌ రెడ్డి (40) రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ జట్టు 21.1 ఓవర్లలో 72/3 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కల్గించింది. దీంతో, వీజేడీ పద్ధతిలో సికింద్రాబాద్‌ను విజేతగా ప్రకటించారు. విద్యార్థిగా ఉన్న సమయంలో సీవీ ఆనంద్ ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆయన 5 సెంచరీలు బాదారు. అండర్-22 క్రికెట్ లో ఆయన సత్తా చాటారు. ఆ తర్వాత ఐఏఎస్ చదివేందుకు క్రికెట్ ను పక్కనబెట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu