Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెన్సార్ సరే. సిక్సర్ కొట్టడమే బాకీ

సెన్సార్ సరే. సిక్సర్ కొట్టడమే బాకీ

Gulte.com 4 days ago

పెద్ది సెన్సార్ పూర్తి చేసుకుంది. 3 గంటల 3 నిమిషాల నిడివితో యు/ఏతో అధికారుల ప్రశంసలు అందుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కి వాళ్ళు ఫిదా అయినట్టు వినిపిస్తోంది.

సరే పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి వార్తలు వినడం మాములే కానీ ఒకవేళ నిజమైతే మాత్రం సంక్రాంతి అయిపోయినప్పటి నుంచి సరైన మాస్ కంటెంట్ లేక అల్లాడిపోతున్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు అతి పెద్ద ఆక్సిజన్ అందుతుంది. అది కూడా కింగ్ సైజులో.

సెన్సార్ అయిపోయింది కాబట్టి పెద్ది ఇక గ్రౌండ్ లో సిక్సర్ కొట్టడం మిగిలి ఉంది. ట్రైలర్ వచ్చాక జరిగిన పరిణామాలు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. యునానిమాస్ రెస్పాన్స్ రాకపోవడం కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ హైప్ ని కంట్రోల్ చేయడానికే బుచ్చిబాబు అలా చేశాడని అంటున్న వాళ్ళు లేకపోలేదు. నేరుగా థియేటర్లోనే చూడాల్సిన సర్ప్రైజులు చాలా ఉన్నాయని అందుకే రాజీ పడి అలా కట్ చేయించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సరే అది అబద్దమా నిజమా అనేది పక్కన పెడితే పెద్దికి ముందు చాలా సవాళ్లు స్వాగతం చెబుతున్నాయి. సమస్య పరిష్కారం అయ్యిందని చెబుతూనే తెలంగాణ సింగల్ స్క్రీన్ల పర్సెంటెజ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలేం జరుగుతోందో ఇండస్ట్రీ పెద్దలకు సైతం అంతు చిక్కడం లేదు. పెద్ది రిలీజ్ కు ఇంకో 13 రోజులు మాత్రమే టైం ఉంది. ఈలోగా పరిష్కరించుకోవాలి. లేదంటే సరిపడా స్క్రీన్లు అందుబాటులోకి రాక వసూళ్లు తగ్గుతాయి.

పుష్ప 2, మన శంకరవరప్రసాద్ గారులకు కూడా ట్రైలర్ టైంలో ఇలాంటి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో పెద్ది గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నీ బుచ్చిబాబు గమనిస్తున్నారని, అవన్నీ చూసి ఫీలవ్వడానికి బదులు హ్యాపీగా ఉన్నారని వినికిడి. ఆ రేంజ్ లో సినిమా వచ్చిందనే ధీమాతో ఉన్నారట. భోపాల్ లో జరిగే ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కన్సర్ట్ తో ప్రచారం మళ్ళీ ఊపందుకునే ఛాన్స్ ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu