Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం వెనుక దర్శకుడి పట్టుదల

సీఎం వెనుక దర్శకుడి పట్టుదల

Gulte.com 5 days ago

విజయ్ భవిష్యత్తుని ముందే ఊహించాడు అనడం కంటే, వెంకట్ ప్రభు దాన్ని తెర మీద పట్టుబట్టి చూపించాడు అనడం కరెక్ట్. 'GOAT' సినిమాలో 'TN07 CM 2026' నంబర్ ప్లేట్ పెట్టినప్పుడు చాలామంది నవ్వారు.

హీరోని పొగడటం కామన్. ప్రతి దర్శకుడూ తన హీరోని పవర్‌ఫుల్‌గానే చూపిస్తాడు. కానీ ఏకంగా సీఎం అనేసరికి "ఇది ఓవర్" అనే కామెంట్స్ వచ్చాయి. అయినా వెంకట్ ప్రభు వెనక్కి తగ్గలేదు.

యూనిట్ టాక్ ప్రకారం ఆ సీన్‌కి విజయ్ మొదట ఒప్పుకోలేదట. రాజకీయ కలర్ వస్తుంది, ఇప్పుడే వద్దు అని చెప్పాడట. కానీ వెంకట్ ప్రభు మాత్రం ఇది ఉంటేనే కిక్. ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తాయి అని పట్టుబట్టాడట. దర్శకుడిగా తనకి ఉన్న కమర్షియల్ సెన్స్‌తో ఆ సీన్‌కి సీఎం వైబ్స్ తీసుకొచ్చాడు. సెట్స్‌లో కూడా దీని మీద చర్చ జరిగిందట. ఫైనల్‌గా దర్శకుడు చెప్పిందే ఫైనల్ అయింది. ఆ ఒక్క షాట్ సినిమాలో 3 సెకన్లు కనిపిస్తుంది. థియేటర్‌లో మాత్రం విజిల్స్ పడ్డాయి.

కట్ చేస్తే ఏడాదిన్నర తిరిగేసరికి సీన్ రివర్స్ అయ్యింది. విజయ్ నిజంగానే తమిళనాడు సీఎం అయ్యాడు. అప్పుడు ఓవర్ అన్న వాళ్లే "VPకి దూరదృష్టి ఉంది" అన్నారు. కానీ ఇది ఊహ కాదు. ఇది రిస్క్. హీరో వద్దు అన్నా, ట్రోల్స్ వస్తాయని తెలిసినా ఆ ఎలివేషన్ ఇవ్వడం అంటే దర్శకుడికి కాన్ఫిడెన్స్ ఉండాలి. వెంకట్ ప్రభు ఆ కాన్ఫిడెన్స్‌ని నమ్మాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద అతనికి క్లారిటీ ఉండి ఉండొచ్చు. లేదా ఫ్యాన్ బాయ్ శాంపిల్‌గా అలా పెట్టి ఉండొచ్చు. రీజన్ ఏదైనా రిజల్ట్ మాత్రం VPకి ప్లస్ అయింది.

ఇప్పుడు అదే నంబర్ ప్లేట్‌ని ఫ్రేమ్ కట్టి విజయ్‌కి ఇచ్చాడు వెంకట్ ప్రభు. 'THE FIRST MANIFESTATION' అని రాయించాడు. ఫోటో చూస్తే ఇద్దరి మొహాల్లో హ్యాపీ కనిపిస్తుంది. ఒకరు హీరో నుంచి సీఎం అయ్యాడు. ఇంకొకరు ఆ జర్నీని తెర మీద ముందే చూపించిన క్రెడిట్ తీసుకున్నాడు. సినిమా హిస్టరీలో హీరోకి ఎలివేషన్ ఇచ్చిన దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ హీరో రియల్ లైఫ్‌ని స్క్రీన్ మీద పెట్టి, అది నిజం చేశానని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు మాత్రం వెంకట్ ప్రభు ఒక్కడే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu