Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎంకు మరో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం పదుల సంఖ్యలో పోటీ!

సీఎంకు మరో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం పదుల సంఖ్యలో పోటీ!

Gulte.com 3 weeks ago

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని ఎంపిక చేస్తారు? అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది?

అనే విషయాలు.. సీఎంగా ఆయనకు ఇబ్బందికరంగా మారనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే విని పిస్తోంది. ఇప్పటికి ఒకసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. అయినప్పటికీ.. మరో రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి.

దీనికితోడు కీలకమైన హోం శాఖ ముఖ్యమంత్రి చెంతనే ఉంది. దీనిని వేరే వారికి ఇవ్వకతప్పదు. హోం శాఖపై ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు స్టేషన్లు.. అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయని.. హైకోర్టు కొన్నాళ్ల కిందట సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక, బదిలీలు కూడా జరగడం లేదని.. క్షేత్రస్థాయిలో పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ శాఖకు మంత్రిని కేటాయించాల్సిన అవసరం ఉంది.

అలానే లెక్క ప్రకారం ఉండాల్సిన మంత్రుల సంఖ్యలో రెండు ఖాళీ ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేవంత్ ఈ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలోనే పార్టీ అధిష్టానం మంత్రివర్గ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ పోటీలో పదుల సంఖ్యలో నాయకులు ఉండడం మరోసారి రేవంత్‌కు ఇబ్బందిగా మారుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే.. వీరిలో ఇద్దరిని ఎంపిక చేసే బాధ్యత సీఎంకే అప్పగించే సూచనలు ఉన్నాయి.

పోటీలో ఉన్నది వీరే..

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(మునుగోడు ఎమ్మెల్యే)
  • బాలూనాయక్ (దేవరకొండ ఎమ్మెల్యే)
  • రామచంద్రునాయక్‌(డోర్నకల్ ఎమ్మెల్యే)
  • పి. సుదర్శన్ రెడ్డి(బోధన్ ఎమ్మెల్యే)
  • ప్రేమ్ సాగర్‌రావు(మంచిర్యాల ఎమ్మెల్యే)
  • మహేశ్‌కుమార్‌గౌడ్‌(పీసీసీ చీఫ్‌)
  • మల్‌రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే)
  • మదన్‌మోహన్‌రావు (ఎల్లారెడ్డి ఎమ్మెల్యే)
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu