Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పైడర్ మ్యాన్ సక్సెస్. ఏ పాఠం నేర్చుకోవాలి

స్పైడర్ మ్యాన్ సక్సెస్. ఏ పాఠం నేర్చుకోవాలి

Gulte.com 3 weeks ago

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట అన్నారు. స్పైడర్ మ్యాన్ స్పందన చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని, వాళ్ళ మార్కెటింగ్, పబ్లిసిటిని స్టడీ చేసి దానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఇప్పటి ప్రొడ్యూసర్లకు ఉందని హితవు పలికారు.

ఆయన అన్నదాంట్లో కొంత మేర లాజిక్ ఉన్నప్పటికీ నిజానికి హాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న విజయాల వెనుక మనం నేర్చుకోవాల్సిన పాఠాలు వేరే ఉన్నాయి.

ఇటీవలే లెనిన్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ ఒడిస్సి రిలీజ్ డేట్ ఏడాది క్రితం ప్రకటించి మాట తప్పకుండా విడుదల చేశారని, మనం కనీసం రెండు వారాల ముందు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోలేకపోతున్నామని ఫీలయ్యారు. ఇది నిజంగా సీరియస్ ఇష్యూనే. స్పైడర్ మ్యాన్ కూడా అదే స్ట్రాటజీతో డెడ్ లైన్ మిస్ కాకుండా చూసుకుంది. ఇది మొదటి లెసన్. రెండోది మేకింగ్, విఎఫెక్స్ క్వాలిటీ విషయంలో మర్వెల్, డిస్నీ లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ అద్భుత ఫలితాలు అందుకుంటున్నాయి.

కానీ మనమేం చేస్తున్నాం. ఆచార్యలో ఒక్క చిన్న సన్నివేశంలో చిరంజీవి డీ ఏజింగ్ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాం. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ బృందం గుంపుగా వెళ్లే గుర్రం సీన్ ఒకటి ట్రోలింగ్ కు గురైతే దాన్ని రెండో రోజే తీసేయాల్సి వచ్చింది. రాజా సాబ్ విఎఫ్ఎక్స్ ని మెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన అమ్మోరు, అంజి, అరుంధతి, దేవి గ్రాఫిక్స్ వీటికన్నా మెరుగ్గా ఉన్నాయంటే తప్పు ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాలా.

మనం ఇంప్రూవ్ కావాల్సింది ఇలాంటి విషయాల్లోనే. నిజానికి స్పైడర్ మ్యాన్ ఇండియాలో భీభత్సమైన పబ్లిసిటీ చేయలేదు. ఫ్రాంచైజ్ కున్న హైప్ వల్ల ఆటోమేటిక్ గా జనాలు ఎగబడ్డారు. ఎమోషన్ కాస్త ఎక్కువైనప్పటికీ ఒకసారి చూడాల్సిందేనని ఫిక్స్ అయిపోయి టికెట్లు కొనేస్తున్నారు. ఇప్పుడే కాదు ఇంకో మూడేళ్ళలో ఇంకో స్పైడర్ మ్యాన్ సినిమా వస్తే ఇంతకన్నా ఎక్కువే ఎగబడతారు. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ తాలూకు మేజిక్ అది. మనవాళ్ళూ దాన్ని అంది పుచ్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu