Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుబ్బులక్ష్మి బయోపిక్. సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుబ్బులక్ష్మి బయోపిక్. సాయిపల్లవి స్థానంలో రష్మిక

Gulte.com 1 week ago

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్ ఏర్పాట్లలో ఉన్న సంగతి తెలిసిందే.

ముందీ పాత్ర కోసం సాయిపల్లవిని అనుకున్నారు. దాదాపుగా ఓకే అయినంత దూరం వెళ్ళింది. కానీ క్రమంగా ఈ ప్రాజెక్టుకి ఎక్కువ డేట్స్ అవసరం కావడంతో వాటిని అడ్జస్ట్ చేసే పరిస్థితిలో ఆమె లేకపోవడంతో ఇప్పుడా అవకాశం రష్మిక మందన్నని వరించినట్టు తెలిసింది. ఇది అద్భుతమైన అవకాశం.

ఇప్పటి తరానికి సుబ్బులక్ష్మిగారి గురించి తక్కువ తెలిసి ఉంటుంది కాబట్టి ఇలాంటి కథలను స్క్రీన్ ద్వారా చెప్పే అవసరం ఎంతైనా ఉంది. రష్మిక మందన్నకు ఈ ఛాన్స్ రావడం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే కీర్తి సురేష్ ఎన్ని సినిమాలు చేసినా, ఎందరు స్టార్ హీరోలతో నటించినా మహానటి తెచ్చిన ఫేమ్ ముందు అవన్నీ తక్కువే. తనకే కాదు వేరే ఏ ఇతర హీరోయిన్ కి మహానటిని మించే పెర్ఫార్మన్స్ సినిమా దొరకలేదు. సుబ్బులక్ష్మి ఆత్మకథలో ఆ ఛాన్స్ ఉంది.

అయితే సావిత్రి గారి జీవితం లాగా సుబ్బులక్ష్మి గారి లైఫ్ లో ఎక్కువ డ్రామా, విషాదం ఉండవు. కానీ ఆసక్తికరమైన సంఘటనలు బోలెడు. చిన్న వయసులోనే గాయని కావడం దగ్గరి నుంచి అంతర్జాతీయ పురస్కారాలు అందుకునే స్టేజి వరకు వెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవమానాలు చవి చూశారు. అవన్నీ సినిమాలో వస్తాయి. రష్మిక మందన్నకు నటన పరంగా ఇదో ఛాలెంజ్ అవుతుంది. అంచనాలు నిలబెట్టుకుంటే ఎప్పటికీ చెప్పుకునే సినిమా అవుతుంది.

సెప్టెంబర్ 16 సుబ్బులక్ష్మి గారి జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు. కమర్షియల్ ప్యాన్ ఇండియా సినిమాల మధ్య నలిగిపోతున్న జనాలకు ఇలాంటి మూవీస్ రిలీఫ్ తో పాటు స్ఫూర్తిని, జ్ఞానాన్ని ఇస్తాయి. సంగీత దర్శకుడు, ఇతర క్యాస్టింగ్ తదితర వివరాలు త్వరలోనే తెలియబోతున్నాయి. హీరో ఎవరైనా కథ మొత్తం రష్మిక మందన్న చుట్టే ఉంటుంది కాబట్టి ఆ విషయంలో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిని తీసుకోకపోవచ్చు. చూద్దాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu