Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పు ఒప్పేసుకున్న వీరభద్రుడు

తప్పు ఒప్పేసుకున్న వీరభద్రుడు

Gulte.com 5 days ago

బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది. సూర్యని ఊరిస్తున్న విజయం ఎట్టకేలకు దక్కింది.

మొదటి వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొంత నెమ్మదించినప్పటికీ ప్రధాన కేంద్రాల్లో ఆక్యుపెన్సీలు బాగానే ఉంటున్నాయి. బాక్సాఫీస్ కు మాస్ కరువు ఏ స్థాయిలో ఉందో వీరభద్రుడుతో తెలిసి వచ్చింది. ఇదంతా బాగానే ఉంది కానీ వీరభద్రుడు చేసిన ఒక తప్పుని త్వరగానే తెలుసుకున్నాడు.

అదేంటంటే ఒక సీన్ లో బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ కాంత్ సినిమా పాట ఒకటొస్తుంది. ఇది ఇళయరాజా కంపోజింగ్. దీని మీద దర్శకుడు ఆర్జె బాలాజీ ఇన్ డైరెక్ట్ గా ఒక కౌంటర్ రాశారు. హక్కుల కోసం పోరాడే దాని గురించి ఒక వ్యంగ్య మాట ఉంటుంది. అది రాజా అభిమానులను హర్ట్ చేసింది. ఇళయరాజా కాపీ రైట్స్ విషయంలో కోర్టుకి వెళ్లిన దాదాపు ప్రతిసారి గెలిచారు. అలాంటిది అదేదో చేయకూడని పని అన్న తరహాలో కామెడీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది గుర్తించిన నిర్మాణ సంస్థ వెంటనే ఆ సీన్ మార్పుకు సిద్ధపడి క్షమాపణ కోరుతూ ఒక లేఖ విడుదల చేసింది. నిజానికి సన్నివేశం రాసే స్టేజిలోనే ఇలాంటివి ఆలోచించుకోవాలి. ఇళయరాజా లాంటి గొప్ప కంపోజర్ కోలీవుడ్ కు దక్కిన వరం. ప్రపంచవ్యాప్తంగా ఆయన పాటలకు కుర్ర జనరేషన్ లోనూ అభిమానులు ఉన్నారు. అలాంటిది ఆ విద్వత్తు, వయసుకు గౌరవం ఇవ్వకుండా ఏదో పంచ్ వేశామని ఫీలైతే ఇలాంటి పరిణామాలే ఉంటాయి.

ఏదైతేనేం ఫైనల్ గా సారి అయితే చెప్పారు. మూవీ రిజల్ట్ పట్ల సూర్య పిచ్చ హ్యాపీగా ఉన్నాడు. పదమూడు సంవత్సరాల తర్వాత తన సినిమా కమర్షియల్ గా ఇంత పెద్ద సక్సెస్ సాధించడం చూసి తనకు మాటలు రావడం లేదు. క్లైమాక్స్ లో అయన వేసిన దేవుడి పూనకం ఎపిసోడ్ కు తమిళంలో భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. జనాలు సీట్లలోనే ఊగిపోతున్నారు . కరుప్పు స్వామి మీద తమిళులకు ఆరాధనాభావం చాలా ఎక్కువ, అందుకే ఈ మూవీ ఇంతగా క్లిక్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu