Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల థియేటర్లు 'పెద్ది'ఫైడ్

తెలుగు రాష్ట్రాల థియేటర్లు 'పెద్ది'ఫైడ్

Gulte.com 3 weeks ago

నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా వస్తే ఎంత సందడిగా ఉంటుందో, పరిశ్రమకు ఎంత శుభ సంకేతాలు ఇస్తుందో మరోసారి రుజువయ్యింది.

ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు ఉన్నప్పటికీ రామ్ చరణ్ కష్టానికి అది వర్త్ అన్నంత రేంజ్ లో కేవలం అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు, కుటుంబాలు నిన్న పెద్ద సంఖ్యలో కనిపించడం పెద్ది మీదున్న క్రేజ్ కు నిదర్శనం.

హైదరాబాద్ లో ఆలస్యంగా బుకింగ్స్ మొదలుపెట్టినప్పటికీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఏపీ గురించి చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న సెంటర్లు సైతం హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. పలు చోట్ల బ్లాక్ దందా, రికమండేషన్లు నడిచేంత స్థాయిలో టికెట్ల కోసం డిమాండ్ ఏర్పడింది. ట్రైలర్ సమయంలో హైప్ కొంచెం హెచ్చుతగ్గులకు గురైనట్టు కనిపించినా ఒక్కరోజులో వాతావరణం మారిపోయింది. ఆడియన్స్ ఎంత ఆకలి మీద ఉన్నారో ఓపెనింగ్స్ స్పష్టం చేయబోతున్నాయి.

ఇవాళ దాదాపు అన్ని మెయిన్ సెంటర్స్ లో టికెట్ ముక్క లేనంతగా ఫుల్ అయిపోయాయి. గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ స్కూల్స్, కాలేజీల సెలవులు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో వసూళ్ల పరంగా ట్రేడ్ ధీమాగా ఉంది. అందులోనూ రూటెడ్ స్టోరీ కావడంతో మాస్ కేంద్రాల్లో జనాలు బాగా వస్తున్నారు. ఎర్లీ ప్రీమియర్ల నుంచి టాక్ పాజిటివ్ గానే ఉంది. రామ్ చరణ్ పెర్ఫార్మన్స్, బుచ్చిబాబు డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

పబ్లిక్ తీర్పు ఏ స్థాయిలో ఉంటుందనేది వారం పది రోజులు ఆగాక క్లారిటీ వస్తుంది. పెద్ద నెంబర్లు ఖాయమే. సోషల్ మీడియాలో అధిక శాతం పాజిటివ్ రియాక్షన్లు కనిపిస్తున్నాయి. కొంత మిశ్రమ స్పందన లేకపోలేదు కానీ ఇలాంటి భారీ అంచనాలున్న సినిమాలకు ఇది సహజమే కాబట్టి ఇంకొన్నిరోజులు వేచి చూడాలి. సామాన్య ప్రేక్షకులే కాదు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం నిన్న పెద్ది ప్రీమియర్ షో కోసం క్యూ కట్టారు. ఆ వీడియోలు ఎక్స్, ఇన్స్ టాలో వైరల్ అవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu