Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెరపై తొలిసారి 'సీఎం విజయ్'

తెరపై తొలిసారి 'సీఎం విజయ్'

Gulte.com 1 week ago

టీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు విజయ్. సినీ రంగానికి గుడ్ బై చెప్పేయడం బాధ కలిగించినప్పటికీ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే సీఎం కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

ఐతే రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చివరగా 'జననాయగన్' అనే సినిమాలో నటించాడు.

అది సంక్రాంతికే రావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల దాని రిలీజ్ ఆలస్యం అయింది. ఈ నెల చివర్లో రిలీజ్ అంటున్నారు.ఆ చిత్రంలో విజయ్ పేరుకు ముందు 'దళపతి' అని కాకుండా 'ముఖ్యమంత్రి' అని చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. నిర్మాత కూడా అందుకు ఉత్సాహంగానే ఉన్నప్పటికీ.. విజయ్ అందుకు సుముఖంగా లేడని, ఆ టైటిల్ వద్దని చెబుతున్నాడని వార్తలు వచ్చాయి.

ఐతే 'జననాయగన్'లో విజయ్ పేరు ముందు సీఎం ఉంటుందో లేదో కానీ.. అంతకంటే ముందు వేరే సినిమాలో 'సీఎం విజయ్' అంటూ టైటిల్ వేసేశారు. ఆ చిత్రమే.. కరుప్పు. సూర్య హీరోగా నటించిన 'కరుప్పు' చిత్రానికి ఉదయం 9 గంటల షోలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతగా మొదట్లో ఆయనకు థ్యాంక్స్ కార్డ్ వేశారు. అందులో 'సీఎం విజయ్' అని సంబోధించారు. ఇలా వెండితెరపై తొలిసారిగా 'సీఎం విజయ్' అని కనిపించడంతో తమిళనాడు థియేటర్లలో కోలాహలం మామూలుగా లేదు.

సాధారణంగా సూర్యను విజయ్ పోటీ హీరోగా చూస్తారు కానీ.. ఈ సినిమా విషయంలో మాత్రం విజయ్ ఫ్యాన్స్ కూడా అతణ్ని ఓన్ చేసుకోవడానికి దీంతో పాటు మరో కారణం కూడా ఉంది. ఇందులో 'లియో' సినిమాలోని ఒక సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు.

కేఫ్ సన్నివేశాన్ని తలపించే సన్నివేశం పెట్టి.. ముఖం చూపించకుండా ఆ సీన్లో విజయ్ ఉన్నట్లుగా ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు. సూర్య లాంటి పెద్ద హీరో సినిమాలో ఇలా విజయ్‌కి ఎలివేషన్ ఇవ్వడం విజయ్ అభిమానులకు ఎంతో నచ్చుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu