Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
థియేటర్ క్లిప్‌తో సినిమాకు అదిరే ప్రమోషన్

థియేటర్ క్లిప్‌తో సినిమాకు అదిరే ప్రమోషన్

Gulte.com 3 weeks ago

క్షిణాదిన ఒకప్పుడు బహు భాషల్లో మంచి పాపులారిటీ ఉన్న సీనియర్ హీరోల్లో అర్జున్ ఒకడు. 90వ దశకంలో అతను హీరోగా నటించిన జెంటిల్‌మ్యాన్, ఒకే ఒక్కడు లాంటి చిత్రాలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే.

కానీ చాలామంది సీనియర్ల లాగే ఒక దశ తర్వాత ఆయన్నీ పరాజయాలు పలకరించాయి. క్రమంగా మార్కెట్ కోల్పోయాడు. గత దశాబ్ద కాలంలో చాలా వరకు విలన్, క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితం అయిపోయారు అర్జున్. హీరోగా సినిమాలు చేయడం దాదాపుగా మానేశాడు.

ఇలాంటి టైంలో అర్జున్ ప్రధాన పాత్రలో బ్లాస్ట్ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో సీనియర్ నటి అభిరామి, యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ లేదు. అర్జున్ హీరోగా అంటే జనం ఏం చూస్తారులే అనే ఫీలింగే అందరిలోనూ ఉంది. కానీ బ్లాస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సర్ప్రైజ్‌గా నిలిచింది.

తమ కరాటే నైపుణ్యంతో విలన్ల ఆట కట్టించే ఫ్యామిలీ మెంబర్స్‌గా అర్జున్, అభిరామి, ప్రీతిల పాత్రలు ప్రేక్షకులకు భలేగా నచ్చేశాయి. పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ సినిమా థియేటర్ క్లిప్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం దృష్టి బ్లాస్ట్ మీద పడడం మొదలైంది.

తనతో కార్లో అసభ్యంగా ప్రవర్తించే బాస్‌కు ప్రీతి బుద్ధి చెప్పే సీన్ అయితే తెగ వైరల్ అవుతోంది. సినిమాకు సగం ప్రమోషన్ థియేటర్ నుంచి క్యాప్చర్ చేసిన ఈ వీడియో క్లిప్పే చేసి పెట్టింది అంటే అతిశయోక్తి కాదు. ఎంతో ఆసక్తి రేకెత్తించే ఆ సన్నివేశం ప్రేక్షకుల్లో సినిమా చూడాలన్న క్యూరియాసిటీ పెంచింది.

సినిమాకు టీం నుంచి సరైన పబ్లిసిటీ లేకపోయినా సరే.. దీంతో పాటుగా మరి కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం, మౌత్ టాక్ కూడా బాగుండడంతో రోజు రోజుకూ బ్లాస్ట్‌కు కలెక్షన్లు పెరుగుతున్నాయి. తొలి రోజు కంటే నాలుగో రోజు ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు రావడం విశేషం. ఇప్పటికే బ్లాస్ట్ రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. పూర్తిగా మార్కెట్ కోల్పోయిన అర్జున్ నటించిన సినిమాకు ఈ వసూళ్లు ఊహించనివే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu