Dailyhunt
టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

Gulte.com 1 week ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ దుందుబి మోగించారు.

పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ లో భారీ మెజారిటీతో విజయ్‌ విజయం సాధించారు.

పెరంబూరులో డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ పై 40 వేల ఓట్ల తేడాతో విజయ్ గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్ లో 20వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
మరోవైపు మ్యాజిక్ ఫిగర్ 118 కి అడుగు దూరంలో టీవీకే నిలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని విజయ్ తండ్రి చంద్రశేఖర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుంది. .

కాగా, తమిళనాడుకు కాబోయే సీఎం విజయ్ కులమేంటి అనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, విజయ్ కులం స్థానంలో ఆయన తండ్రి చంద్రశేఖర్ ‘తమిళం’ అని విజయ్ చదువుకునే రోజుల్లోనే పాఠశాల రికార్డుల్లో పొందుపరిచారు.

అయితే విజయ్ చదువుతున్న పాఠశాల వారు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆందోళనకు దిగుతానని చంద్రశేఖర్ హెచ్చరించడంతో విజయ్ కులం తమిళం గానే కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu