Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలిసారి బాలయ్యతో అనిరుధ్‌?

తొలిసారి బాలయ్యతో అనిరుధ్‌?

Gulte.com 3 weeks ago

టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోల సినిమాలకు పని చేశాడు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.

తనకు తెలుగులో డిమాండ్ మామూలుగా లేదు. ఇక్కడున్న అగ్ర కథానాయకులందరినీ అతను కవర్ చేసే అవకాశాలున్నాయి.

ఇప్పుడు అతడు ఒక ఊహించని కాంబినేషన్‌కు పని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ సీనియర్ కథానాకుడు, మాస్ సినిమాలకు పెట్టింది పేరైన నందమూరి బాలకృష్ణతో అనిరుధ్ జట్టు కట్టే అవకాశాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించబోయే సినిమాను ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తాడా.. లేక తమన్‌ను ఎంచుకుంటారా అని అందరూ గెస్సింగ్‌లో ఉంటే.. అనిరుధ్ పేరు తెరపైకి వచ్చింది.

బాలయ్యకు, అనిరుధ్ కు సింక్ కుదురుతుందా అన్న చిన్న సందేహం ప్రేక్షకుల్లో కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బాలయ్య సినిమాలు మరీ మాస్ గా ఉంటాయి. అనిరుధ్ మాస్ పాటలు ఇవ్వడని కాదు కానీ.. కొంచెం క్లాస్, స్టైలిష్ టచ్ ఉంటుంది. ఐతే ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల కాబట్టి.. బాలయ్య తన శైలి సినిమా చేశాడంటే అనిరుధ్ మ్యూజిక్ బాగానే సెట్ అవుతుంది.

బాలయ్య కొన్నేళ్లుగా వరుసగా తన సినిమాలకు తమన్ తోనే మ్యూజిక్ చేయించుకున్నాడు. ఇద్దరికీ బాగా లంకె కుదిరింది. కానీ ఇప్పటిదాకా తమన్ తో పని చెయ్యని కొరటాల.. ఆల్రెడీ తనతో దేవరకు వర్క్ చేసిన అనిరుధ్ నే ప్రిఫర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అలా బాలయ్య – అనిరుధ్ ల ఆశ్చర్యకర కలయికను చూడబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడు, దేవర నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ప్రొడ్యూస్ చెయ్యబోతున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu