Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రైలర్ డే. హీట్ పెంచే తీరాలి పెద్ది

ట్రైలర్ డే. హీట్ పెంచే తీరాలి పెద్ది

Gulte.com 1 week ago

వాళ పెద్ది ట్రైలర్ రానుంది. మధ్యాన్నం ముంబైలో మూడు గంటలకు జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ మొన్నే అక్కడికి చేరుకోగా మిగిలిన సభ్యులు అందుబాటులోకి వచ్చేశారు.

జాన్వీ కపూర్ ఉండేది అక్కడే కాబట్టి ఇబ్బంది లేదు. మూడు నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ కొందరు మీడియా ప్రతినిధులు ముందే చూసేసి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చారు.

నిజంగా దానికి తగ్గట్టు ఉంటే మాత్రం బ్లాస్ట్ అవుతుంది. హిందీ మార్కెట్ దీని మీద ఆధారపడి ఉంది. సీక్వెల్ కాదు కాబట్టి పుష్పకు దక్కిన అడ్వాంటేజ్ పెద్దికి లేదు. అందులోనూ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడం ఎంతో కొంత అక్కడి జనాల్లో ప్రభావం చూపిస్తోంది. దాన్ని పూర్తిగా చెరిపేయాలంటే పెద్ది ట్రైలర్ అదిరిపోవడం అవసరం. కంటెంట్ కరెక్ట్ గా కుదిరి నార్త్ ఆడియన్స్ లో నమ్మకం వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ బాగుంటాయి. ఎలాగూ పెద్దగా పోటీ లేదు కాబట్టి.

అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్ప్స్ వస్తుంది కనక ఆలోగానే పెద్ది ట్విట్టర్, ఇన్స్ టా తదితర మాధ్యమాలను ముంచెత్తడం ఖాయం. అసలే రెండు మూడు వాయిదాల తర్వాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. అందులోనూ బుచ్చిబాబు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అవి మరింత పెరిగాయి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వాళ్ళలో చాలా బలంగా కనిపిస్తోంది.

రిలీజ్ ఇంకో పదిహేను రోజులు మాత్రమే ఉండటంతో పవర్ ప్లే పేరుతో చేస్తున్న ప్రమోషన్లు పీక్స్ కు చేరుకోబోతున్నాయి. ఇరవై రెండున ఆర్సిబితో సన్ రైజర్స్ ఆడే మ్యాచ్ ని కూడా వాడుకోబోతున్నారు. రామ్ చరణ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఊర మాస్ జాన్వీ పాత్ర, మైండ్ బ్లాంక్ చేసే చివరి షాట్ తదితర విశేషాలతో పెద్ది ట్రైలర్ చేయబోయే విధ్వంసం మాములుగా ఉండేలా లేదు. సాయంత్రం నాలుగు గంటలకు ఆన్ లైన్ రిలీజ్ ఉండొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu