Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్రిష 'నో' చెప్పడానికి సిద్ధపడిందా

త్రిష 'నో' చెప్పడానికి సిద్ధపడిందా

Gulte.com 1 week ago

జనీకాంత్, కమల్ హాసన్ కలయికలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ క్యాస్టింగ్ సెట్ చేసుకోవడం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు పెద్ద సవాల్ గా మారిపోయింది.

ఒకపక్క జైలర్ 2 ఒత్తిడిని భరిస్తూనే ఇంకోవైపు ఈ పనులు చూసుకోవాల్సి వస్తోంది. ఇద్దరిలో ఒకరి సరసన త్రిష నటించేందుకు అంగీకారం తెలిపిందనే వార్త చెన్నై వర్గాల్లో గట్టిగా చక్కర్లు కొట్టింది. పన్నెండు కోట్ల భారీ రెమ్యునరేషన్ అడిగినా సరే నిర్మాణ సంస్థలు ఇచ్చేందుకు రెడీ అయ్యాయని టాక్ వచ్చింది.

తీరా చూస్తే ఇంత క్రేజీ ఆఫర్ ని త్రిష వదులుకోవచ్చని కోలీవుడ్ టాక్. ఎందుకంటే కమల్ రజని మూవీ తీస్తున్న ప్రొడ్యూసర్లలో రెడ్ జెయంట్ బ్యానర్ ఉంది. ఇది తమిళనాడు మాజీ సిఎం స్టాలిన్ కుటుంబానిది. దీని వ్యవహారాలన్నీ ఉదయనిధి చూసుకుంటున్నాడు. కమల్ హాసన్ ఇంకో నిర్మాత. భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ముందుజాగ్రత్తగా త్రిషని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోమని విజయ్ సూచించినట్టు పుకారు మొదలయ్యింది.

నిజమో కాదో కానీ అంత ఈజీగా అయితే కొట్టి పారేయలేం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉదయనిధి మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఏదో ఒక ఇష్యూ రేపుతున్నాడు. సనాతనం వివాదం దాంట్లో నుంచి వచ్చిందే. అలాంటప్పుడు త్రిషని విజయ్ వెళ్లి ఆ సంస్థలో పని చెయ్యమని చెప్పడు కదా అనేది తమిళ విశ్లేషకుల వాదన. కమల్ హాసన్ తో త్రిష గతంలో మన్మధ బాణం, చీకటి రాజ్యం, తగ్ లైఫ్ చేసింది. అన్నీ సూపర్ ఫ్లాపులే.

మరోసారి చేసేందుకు రెడీగానే ఉంది కానీ పరిణామాలు చూస్తే ఇలా దారి మారిపోయాయి. త్రిష నెక్స్ట్ విడుదలయ్యే మూవీ విశ్వంభరనే. చిరంజీవి సరసన ఫుల్ లెన్త్ హీరోయిన్ గా నటించడం ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన స్టాలిన్ తర్వాత ఇదే. మోహన్ లాల్ నటించిన రామ్ ఏ స్టేజిలో ఉందో ఎలాంటి అప్డేట్ లేదు. సూర్య కరుప్పుకి టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్, రెవిన్యూ వర్కౌట్ అయ్యేలా ఉంది. కమర్షియల్ గా హిట్టు ముద్ర పడితే త్రిష వరస ఫ్లాపుల ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్టే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu