Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వారణాసి షూటింగ్‌ స్టేటస్ ఏంటి?

వారణాసి షూటింగ్‌ స్టేటస్ ఏంటి?

Gulte.com 4 hrs ago

రూ.4 వేల కోట్ల బడ్జెట్లో 'రామాయణం' రెండు భాగాలను నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రా.. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు కానీ, ప్రేక్షకుల దృష్టిలో మాత్రం రాజమౌళి, మహేష్ బాబుల 'వారణాసి'నే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం.

ఆ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు. ఇక ఈ సినిమా స్కేల్, కాన్వాస్ ఏ రేంజిలో ఉండబోతున్నాయో గత ఏడాది రిలీజ్ చేసిన షో రీలే ఉదాహరణ.
అది చూశాక ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను మించి జక్కన్న వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తాడనే అంచనాలున్నాయి.

'వారణాసి'ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని నెలల ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే రాజమౌళి సినిమాలకు మేకింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమై, విడుదల వాయిదా పడడం మామూలే. మరి 'వారణాసి' విషయంలో ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ప్రస్తుతానికి టీంకు సినిమాను వాయిదా వేసే ఆలోచనేమీ లేనట్లే కనిపిస్తోంది.

తాజాగా 'వారణాసి' షూటింగ్ స్టేటస్ ఏంటో రాజమౌళి వెల్లడించాడు. చిత్రీకరణ ఇంకో పది రోజులు మాత్రమే మిగిలున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్‌డేట్ ఇచ్చాడు. మహేష్ బాబు పార్ట్‌కు సంబంధించిన షూట్ గత నెలలోనే పూర్తయింది. మిగతా చిత్రీకరణను ఈ నెలాఖరుకే పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విడుదలకు ఐదు నెలల సమయం ఉంటుంది. వీఎఫెక్స్ కార్యక్రమాలు సమాంతరంగా నడుస్తుండగా.. ఇక డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలోనే మొదలవుతాయి.

మరోవైపు 'వారణాసి' కథ గురించి జక్కన్న మాట్లాడుతూ.. గ్లింప్స్ చూస్తే ఇది సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుందని, కానీ ఇందులో పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ కథ ఉంటుందని జక్కన్న తెలిపాడు. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటు ఒక యువతి-యుకుకుడి మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని రాజమౌళి తెలిపాడు. ఈ సినిమా చేస్తున్నపుడు ఆరేడు కథలను కలిపి ఒకటిగా తీస్తున్నట్లు అనిపించిందని.. తమకు ఇదే అతి పెద్ద సవాలు అని జక్కన్న వ్యాఖ్యానించాడు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu