సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ సోలో హీరోగా చేసిన సినిమా ఇది.
మన శంకరవరప్రసాద్ గారు క్యామియో కాబట్టి కౌంట్ చేయలేం. జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీ తీయబోయే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇస్తున్న ఎంటర్ టైనర్ కూడా ఇదే. అలాంటప్పుడు అంచనాలు ఎలా ఉండాలి. బజ్ ఏ స్థాయిలో ఊగిపోవాలి. కానీ విచిత్రంగా ఏకె 47లో అంత ఊపు కనిపించడం లేదు.
నిజం చెప్పాలంటే టాలీవుడ్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఇది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి కల్ట్ క్లాసిక్స్ కి డైలాగులు రాసిన మాటల మాంత్రికుడు మొదటిసారి వెంకీని డైరెక్ట్ చేస్తున్నారన్న వార్త వచ్చినప్పుడే అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. అలాంటిది ఒక వెరైటీ టైటిల్ పెట్టుకుని ముగ్గురు హీరోయిన్లతో నారాయణమ్మా అంటూ వెంకీ డాన్సులు చేస్తే సోషల్ మీడియా ఊగిపోవాలి. కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్.
దీనికి కారణాలు లేకపోలేదు. విఎఫ్ఎక్స్ డిమాండ్ చేసే సినిమా రేంజులో దీన్ని పలు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. మధ్యలో షూటింగ్ గ్యాపులు బోనస్. దీని వల్ల క్రమంగా హైప్ తగ్గే ప్రమాదం ఏర్పడింది. పైగా క్యారెక్టర్ పరిచయాల పేరుతో వదిలిన టీజర్లు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ తర్వాత వచ్చిన కొత్త టీజర్ డీసెంట్ అనిపించుకుంది. నారాయణమ్మా సాంగ్ ఏ మేరకు జనాన్ని ఆకట్టుకుంటుందో ఇంకో మూడు నాలుగు రోజులు ఆగిస్తే తెలుస్తుంది.
కొన్ని వారాల క్రితం అర్జున్ బ్లాస్ట్ జోన్ కి దీనికి పోలికలు ఉన్నాయని బయట ప్రచారం జరిగింది. నిర్మాత నాగవంశీ వాటిని ఖండించినప్పటికీ టీజర్ విజువల్స్ చూస్తే కొంత అనుమానం రాక మానదు. అసలే బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి టైటిల్ పెట్టుకుని వస్తున్నారు. మరి ఇది ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి. దసరా బరిలో ఇప్పటికే రజినీకాంత్ జైలర్ 2. విజయ్ దేవరకొండ రణబాలి ఉన్నాయి. వాటికి ధీటుగా నిలవాలంటే ఆదర్శ కుటుంబం అదిరిపోయింది అనిపించుకుంటే తప్ప సాధ్యం కాదు.

