Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ గురించి హీరోయిన్‌కు చెత్త ప్రశ్న

విజయ్ గురించి హీరోయిన్‌కు చెత్త ప్రశ్న

Gulte.com 1 week ago

సెలబ్రెటీలు కనిపిస్తే చాలు.. మీడియాలో కొందరు అత్యుత్సాహానికి గురై చెత్త ప్రశ్నలు వేస్తుంటారు. ఇందుకు ఏ ఇండస్ట్రీ జర్నలిస్టులూ మినహాయింపు కాదు.

సినిమాల గురించి లోతుగా ప్రశ్నలు అడిగే పరిజ్ఞానం లేక, సరైన కసరత్తు చేయకపోవడం వల్ల ప్రెస్ మీట్లలో సినిమాలతో సంబంధం లేని వ్యక్తిగత విషయాల గురించి అర్థరహితమైన ప్రశ్నలు వేసే జర్నలిస్టులు మన దగ్గరా చాలామందే ఉన్నారు.

సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా అవేమీ పట్టనట్లు అవే చెత్త ప్రశ్నలు వేసి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. తమిళంలో కూడా ఇలా పేలవమైన ప్రశ్నలతో కొందరు జర్నలిస్టులు తరచుగా సోషల్ మీడియాకు దొరికిపోతుంటారు. ఆ మధ్య గౌరి కిషన్ అనే యువ నటి బరువు గురించి దారుణమైన ప్రశ్నలు వేసి ఒక జర్నలిస్టు ఎంతగా విమర్శలు ఎదుర్కన్నాడో తెలిసిందే. ఇప్పుడు మరో సినీ విలేకరి.. మాళవిక మోహనన్‌ను అడిగిన ప్రశ్నతో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.

తాజాగా తమిళనాట మాళవిక ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఆమెను ఒక సినీ జర్నలిస్టు.. ఒక పిచ్చి ప్రశ్న అడిగాడు. తమిళనాడు సీఎం విజయ్ వెళ్లిన ప్రతి చోటికీ త్రిష వెళ్తోంది కదా, మీరు కూడా విజయ్‌తో కలిసి నటించారు కాబట్టి మీకేమైనా అని అడిగాడు ఆ జర్నలిస్టు. దీంతో మాళవికకు ఏం మాట్లాడాలో అర్థంకాలేదు.

అసలిదేం ప్రశ్న.. దీనికి ఏం సమాధానం చెబుతాం అంటూ ఇబ్బందిపడుతూ నవ్వింది మాళవిక. తర్వాత తేరుకుని.. విజయ్‌తో తాను మాస్టర్ సినిమాకు పని చేశానని.. ఆయన తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిందామె. ఆ జర్నలిస్టు అంతటితో ఆగకుండా విజయ్ పరిపాలన ఎలా ఉంది అని అడిగాడు.

ఐతే ఆయన ఇప్పుడే కదామొదలుపెట్టాడు, అప్పుడే పాలన గురించి అడిగితే ఏం చెబుతాం, కొన్ని రోజులు ఆగండి అని మాళవిక చెప్పింది. ఈ ప్రశ్నలతో విసుగెత్తిన మాళవిక.. లేటెస్ట్‌గా ఎక్స్‌లో ఒక పోస్టు కూడా పెట్టింది. తనను సదరు జర్నలిస్టు అర్థం లేని, సెన్సేషనల్ ప్రశ్నలతో తనను ఎంత ఇబ్బంది పెట్టాడో వివరిస్తూ.. జర్నలిస్టులు గౌరవప్రదమైన ప్రశ్నలు అడగాలని హితవు పలికింది మాళవిక.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu