Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ లేకపోవడమే సూర్యకు ప్లస్సయ్యింది

విజయ్ లేకపోవడమే సూర్యకు ప్లస్సయ్యింది

Gulte.com 6 days ago

మిళనాడులో విజయ్ సిఎం అయ్యారు. రజనీకాంత్ నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. కమల్ హాసన్ వేగం తగ్గిపోయింది. అజిత్ కారు రేసులంటూ వేరే ప్రపంచంలో ఉంటున్నారు తప్పించి సెట్స్ లోకి వెళ్దాం, కథలు విందామనే ధ్యాసలో లేరు.

అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి కొత్త ప్రాజెక్టు మొదలుకాలేదు. శివ కార్తికేయన్ ఒక అడుగు ముందుకు అయిదు అడుగులు వెనక్కు వెళ్తున్నాడు తప్పించి స్థిరమైన హిట్లు లేవు. అందులోనూ తనది మాస్ కటవుట్ కాదు.

ఈ నేపథ్యం సూర్యకి కలిసి వచ్చేలా ఉందని కోలీవుడ్ భావిస్తోంది. ఎందుకంటే కరుప్పు (వీరభద్రుడు) ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. మొదటి వీకెండ్ లోనే 100 కోట్ల మార్క్ దాటెయ్యడమమంటే చెప్పుకోదగిన విషయమే. ఒక రోజు ఆలస్యంగా విడుదలైనా, షోలు క్యాన్సిల్ కావడం లాంటివి ప్రేక్షకులను చికాకు పెట్టినా ఫైనల్ గా సినిమా జనం ముందుకు వచ్చింది. యునానిమస్ రివ్యూస్ రాలేదు. పబ్లిక్ టాక్ కూడా యావరేజ్ కి కిందా మీదా ఉంది. అయినా సరే వసూళ్లు బాగుండటం చూస్తుంటే మాస్ ఎంత ఆకలి మీద ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన గ్యాప్ ని పక్క రాష్ట్రంలోనే కాదు ఏపీ తెలంగాణలో కూడా సూర్య వాడుకుంటున్న వైనం స్పష్టం. ఉస్తాద్ భగత్ సింగ్ తప్పించి గత మూడు నెలల్లో ఒక్క స్టార్ హీరో సినిమా లేకపోవడంతో ఇక్కడ పరిస్థితిని బాగా కిందకు తీసుకెళ్లింది. దీంతో డబ్బింగ్ బొమ్మ అయినా సరే మనోళ్లు కరుప్పుకి ఓటేశారు. అయితే ఈ జోరు వీకెండ్ వరకే పరిమితమవుతుందా లేక హోల్డ్ చేసుకుని హిట్టు కొడుతుందా అనేది వేచి చూడాలి.

ఇప్పుడప్పుడే విజయ్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఓడిపోయి ఉంటే రెండు మూడు చేసేవాడేమో కానీ ముఖ్యమంత్రి కాబట్టి నో మూవీస్. పైగా ఇకపై మేకప్ వేసుకోనని ఎప్పుడో ప్రకటించాడు కూడా. ఈ అవకాశాన్ని సూర్య కనక సరైన సినిమాలతో వాడుకుంటే సాలిడ్ కంబ్యాక్ ఇవ్వొచ్చు. రొటీన్ కథలతో వస్తే మళ్ళీ రిస్క్ లో పడటం ఖాయం. టాలీవుడ్ చాలా బెటర్ అనుకోవాలి. మన దగ్గర వందల కోట్ల నుంచి మినిమమ్ మార్కెట్ ఉన్న మాస హీరోలు పది దాకా ఉంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu