Dailyhunt
విజయ్‌ను కట్టడి చేయడమే వాళ్ళ కొంప ముంచిందా?

విజయ్‌ను కట్టడి చేయడమే వాళ్ళ కొంప ముంచిందా?

Gulte.com 1 week ago

మిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా దూసుకుపోతున్నారు.

అయితే.. ఇంత భారీ విజయానికి కారణం ఏంటి? భిన్నమైన సామాజిక వర్గాలు.. ద్రవిడ ఉద్యమం జోరుగా ఉన్న తమిళనాట.. అనేక మంది నటులు పార్టీలు పెట్టారు. సినీ హీరో విశ్వనటుడు కమల్ హాసన్ సహా.. విజయ్‌కాంత్ వంటివారు కూడా పార్టీలు పెట్టారు.

కానీ, వారికి రాని విజయం.. విజయ్‌కు మాత్రమే దక్కడం విశేషం. ఒకటి ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ కారణమైతే.. ఎన్నికల సమయంలో అధికార పార్టీ డీఎంకే.. కేంద్రంలోని బీజేపీలు చేసిన కుయుక్తులు కూడా విజయ్ కు సానుభూతి పవనాలు వీచేలా చేశాయని అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా విజయ్‌ను హేళన చేసేలా ఇరు పక్షాలు వ్యవహరించడంతో యువత ఎక్కువగా విజయ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

కీలకమైన వ్యాఖ్యలు ఇవీ..

విజయ్ బుడ్డోడు. రంగులు వేసుకునేవాడు. భార్యను వదిలేసి.. వేరే కాపురం పెట్టాడు. తెరమీద నటించాలి .. కానీ, రాజకీయాల్లో కాదు. ఆయనకు ఓనమాలు కూడా తెలియదు. బీజేపీకి విజయ్ బీ టీం. నాయకత్వ లక్షణాలు కూడా లేవు. ఆయన వస్తే.. విధ్వంసమే. ఇలా.. అనేక వ్యాఖ్యలు వినిపించాయి. దీనికితోడు.. 26 నెలల పసి మొగ్గ అంటూ.. చేసిన కామెంట్లు కూడా.. ప్రజల్లో సానుభూతి పెంచాయి.

వీటికి తోడు.. తమిళనాడులో ప్రత్యామ్నాయ పార్టీలు బలంగా లేకపోవడం కూడా.. విజయ్‌కు కలిసి వచ్చింది. అయితే, డీఎంకే, లేకపోతే అన్నాడీఎంకే అన్నట్టుగా ఉన్న తమిళనాడులో తొలిసారి సాహసం చేసి అన్ని స్థానాల్లోనూ 234 కు 229 స్థానాల్లో పోటీ చేసిన పార్టీగా కూడా టీవీకే రికార్డు సృష్టించింది. దీంతో పాటు.. అన్ని వర్గాలకు కనెక్ట్ కావడం.. కొత్త రక్తం కోసం ఎదురు చూస్తున్న తటస్థులు.. వంటివి కూడా కలిసి వచ్చాయి. మొత్తంగా విజయ్ విజయం వెనుక.. డీఎంకే- బీజేపీల నిర్బంధం బాగా కలిసి వచ్చింది.

ఆయనపై కరూర్ తొక్కిసలాట కేసును రుద్దుతున్నారన్న చర్చ జోరుగా సాగింది. ఢిల్లీకి పలుమార్లు విచారణ పేరుతో పిలవడం కూ డా.. బీజేపీకి మైనస్ అయింది. ఇది అన్నాడీఎంకేపై ప్రభావం చూపింది. అదేసమయంలో భార్య విడాకుల కేసు తెరమీదికిరావడం కూడా ఓటర్లను విజయ్‌పై సానుభూతి కురిపించేలా చేశాయన్న చర్చ ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu