Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశ్వనాథ్ ఇంటికి అనుకోని అదృష్టం

విశ్వనాథ్ ఇంటికి అనుకోని అదృష్టం

Gulte.com 1 week ago

స్టార్ హీరోకైనా ఒక హిట్ లేదా ఫ్లాప్ తాలూకు ప్రభావం దాని తర్వాత సినిమా మీద ఖచ్చితంగా ఉంటుంది. దీనికెవరూ మినహాయింపు కాదు. వాళ్ళ ఇమేజ్ తగ్గడమో దెబ్బ తినడమో జరగదు కానీ మార్కెట్ లెక్కల్లో మాత్రం తేడాలు వస్తాయి.ఇది సూర్యకు బాగా అనుభవం, కంగువ, రెట్రో వరసగా డిజాస్టర్ కావడం వీరభద్రుడు మీద ఎఫెక్ట్ చూపించింది.

అయితే టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు నమోదు చేయడం బాక్సాఫీస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

తెలుగు వరకు ఇప్పుడిప్పుడే చెప్పలేం కానీ తమిళంలో అయితే పెద్ద హిట్టు కొట్టేలా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే సూర్య తర్వాతి సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు రెడీ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ మూవీలో మమిత బైజు హీరోయిన్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా సితార బ్యానర్ మీద నిర్మాత నాగవంశీ పెద్ద బడ్జెట్ తో తెరకెక్కించారు. ఆ మధ్య వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంది.

ఇప్పుడు కరుప్పు ఫలితం పుణ్యమాని విశ్వనాధ్ అండ్ సన్స్ కి డిమాండ్ పెరుగుతుంది. కంటెంట్ మాస్ ప్రేక్షకుల కోసం తీసింది కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం వల్ల అన్ని వర్గాలకు చేరువ కావొచ్చనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ధనుష్ సార్ తరహాలో ఇది కూడా సర్ప్రైజ్ హిట్ అవుతుందనే ధీమా అభిమానుల్లో ఉంది. ఇరవై ఏళ్లకు పైగా వయసు గ్యాప్ ఉన్న హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథే ఈ విశ్వనాథ్ అండ్ సన్స్.

ముందు జూలై రిలీజ్ అనుకున్నారు కానీ సాధ్యం కాకపోవచ్చని ఇన్ సైడ్ టాక్. ఆగస్ట్ లో స్వతంత్ర దినోత్సం ఆప్షన్ చూస్తున్నారు కానీ ఒకవేళ అదే టైంలో జైలర్ 2, విశ్వంభర వస్తే ఏం చేయాలనే దాని గురించి కూడా కసరత్తు జరుగుతోంది. పైగా ఆగస్ట్ 21 నాని ప్యారడైజ్ ఉంది. ఇవన్నీ చూసుకుంటే విశ్వనాథ్ సరైన స్లాట్ దక్కించుకోవడం కొంచెం ఛాలెంజ్ గానే అనిపిస్తోంది. రెండు మూడు రోజులు ప్యాచ్ వర్క్ తప్ప గుమ్మడికాయ ఆల్రెడీ కొట్టేశారని చెన్నై వర్గాల కథనం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu