Posts
అండర్సన్ రికార్డు ప్రదర్శన

గాలె: ఇంగ్లండ్‌తో ఆఖరి, రెండో టెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (6/40) ఆరు వికెట్లతో చెలరేగడంతో.. ఓవర్‌నైట్ స్కోరు 229/4తో రెండో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మరో 152 రన్స్ జోడించి 381 వద్ద ఆలౌటైంది. నిరోషన్ డిక్వెల్లా (92) ఎనిమిది రన్స్‌తో సెంచరీ మిస్ చేసుకొన్నాడు. దిల్రువాన్ పెరీర (67) అర్ధ సెంచరీ చేశాడు. 38 ఏళ్ల అండర్సన్ కెరీర్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 30వ సారి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్ (29)ను అండర్సన్ అధిగమించాడు. న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ (36) అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆట చివరకు ఇంగ్లండ్ 98/2 స్కోరు చేసింది. ప్రస్తుతం పర్యాటక జట్టు 283 రన్స్ వెనుకంజలో ఉంది. జానీ బెయిర్‌స్టో (24 బ్యాటింగ్), జో రూట్ (67 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
related stories
-
తాజా వార్తలు రోహిత్ కెరీర్లోనే అత్యుత్తమ టెస్టు ర్యాంక్..
-
ప్రధాన వార్తలు దుమ్మురేపిన అశ్విన్.. కెరీర్ బెస్ట్‌కు రోహిత్
-
తాజావార్తలు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్