Posts
పోరాడిన డిక్వెలా, దిల్రువాన్

గాలె: వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ డిక్వెలా (92; 144 బంతుల్లో 10×4), ఆల్‌రౌండర్ దిల్రువాన్ పెరీరా (67) పోరాడటంతో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 229/4తో రెండో రోజు, శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. కాసేపటికే ఓవర్‌నైట్ సెంచరీ వీరుడు మాథ్యూస్ (110), రమేశ్ మెండిస్ (0)ల వికెట్లు కోల్పోయి 243/6కు చేరుకున్నా.. దిల్రువాన్ పెరీరా (67)తో కలిసి డిక్వెలా స్కోరు పెంచాడు. ఒక దశలో లంక 332/6కు చేరుకుంది. కానీ సెంచరీకి చేరువైన డిక్వెలాతో పాటు లక్మల్ (0), ఎంబుల్డేనియా (7), దిల్రువాన్ల వికెట్లను 49 పరుగుల వ్యవధిలో కోల్పోయిన లంక 400 పరుగుల్లోపే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ (6/40), వుడ్ (3/84) సత్తా చాటారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ ఆట చివరికి 98/2తో నిలిచింది. ఎంబుల్డేనియా (2/33) ధాటికి 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును బెయిర్‌స్టో (24 బ్యాటింగ్)తో కలిసి కెప్టెన్ రూట్ (67 బ్యాటింగ్) ఆదుకున్నాడు.
related stories
-
ప్రధాన వార్తలు శ్రేయస్ అయ్యర్ మరో సెంచరీ
-
స్పోర్ట్స్ ధవన్, శ్రేయస్ శతకాలు
-
తాజా వార్తలు ఎలా ఆడాలో రోహిత్ చూపించాడుగా!