Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
APL : జూన్ 9 నుంచి ఏపీఎల్ 2026.. విశాఖ వేదికగా ప్రారంభం

APL : జూన్ 9 నుంచి ఏపీఎల్ 2026.. విశాఖ వేదికగా ప్రారంభం

HashtagU Telugu 1 week ago

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు ప్రతిభ చాటుకునే వేదికగా నిలిచే ఈ టోర్నీకి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఏపీఎల్-2026 అధికారిక షెడ్యూల్‌ను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.వి. సుజయ్ కృష్ణ రంగారావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు ఈ లీగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ టోర్నీలో మొత్తం ఏడు ఫ్రాంచైజీ జట్లు పోటీపడనున్నాయి.

భీమవరం బుల్స్, రాయలసీమ రాయల్స్, విజయవాడ సన్‌షైనర్స్, అమరావతి రాయల్స్, సింహాద్రి లయన్స్, కాకినాడ కింగ్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మ్యాచ్‌లు విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికల్లో నిర్వహించనున్నారు. రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించనుంది. ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీ జట్లు ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఏపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ బాబు నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu