Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chennai : పోలీసే నిందితుడు.. మైనర్‌పై లైంగిక దాడి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్‌

Chennai : పోలీసే నిందితుడు.. మైనర్‌పై లైంగిక దాడి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్‌

HashtagU Telugu 2 weeks ago

ద్రత కల్పించాలన్ని ఖాకీలే నిందితులుగా మారుతున్నారు. తమిళనాడులో ఓ మైనర్ బాలుడిపై హెడ్ కానిస్టేబుల్ లైగింకదాడి వెలుగులోకి వచ్చింది. రాజధాని చెన్నైలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై ఓ హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 25న బాలుడి తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లగా, అతను తన మామ కుమారేసన్ ఇంట్లో బస చేశాడు. మరుసటి రోజు రాత్రి కుమారేసన్, అతని స్నేహితుడు, హెడ్ కానిస్టేబుల్ వెల్లప్పన్ కలిసి మద్యం సేవించారు.

అనంతరం మద్యం మత్తులో ఉన్న వెల్లప్పన్ బాలుడు విశ్రాంతి తీసుకుంటున్న గదిలోకి వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా.. బాలుడికి బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశాడని.. దీంతో బాలుడు ధైర్యంగా ప్రతిఘటించి, సమీపంలో ఉన్న టీవీ రిమోట్‌తో నిందితుడిని కొట్టి అక్కడి నుంచి బయటపడ్డాడు.

అనంతరం జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా వడపళని పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెల్లప్పన్‌ను అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన చెన్నై పోలీసులు, “పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి..

ఆర్టికల్ 311 ప్రకారం నిందితుడిని తక్షణమే సర్వీస్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది. ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, నేరాలను అరికట్టాల్సిన పోలీసు సిబ్బందే నేరాలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu