Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

HashtagU Telugu 5 days ago

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ పరీక్షల వివాదాలు దేశంలో చర్చనీయాంశంగా మారిన వేళ సరికొత్తగా ఆవిర్భవించిన 'కాక్రోచ్‌ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనలు చేపట్టడానికి తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.

ఎయిర్‌పోర్ట్ నుంచే నిరసనలు
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేసిన అభిజీత్ దీప్కే.. జూన్ 6 శనివారం ఉదయం తాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్నట్లు వెల్లడించారు. పరీక్షల లోపాల వల్ల తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులు, తమ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ''మనం అంతా కలిసి భారత రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా మన గొంతు వినిపించాల్సిన సమయం వచ్చింది. మేమంతా ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలు చేపట్టడానికి అనుమతి కోరతాం'' అని దీప్కే వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu