Dailyhunt
Gang Rape : 13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..జోరు వర్షంలో దారుణం

Gang Rape : 13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..జోరు వర్షంలో దారుణం

HashtagU Telugu 1 week ago

త్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. భారీ వర్షం నుంచి ప్రాణరక్షణ కోసం ఒక భవనంలో తలదాచుకున్న 13 ఏళ్ల నిరుపేద బాలికపై ఐదుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

లక్నోలో నివసించే 13 ఏళ్ల మైనర్ బాలిక ఒక కేర్ హోమ్‌లో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. మంగళవారం సాయంత్రం ఆమె పనికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో, సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలోకి వెళ్ళింది. అక్కడ పనిచేస్తున్న ఒక కార్మికుడు ఆమెను చూడగానే వంచనతో లోపలికి లాక్కెళ్ళాడు. బాలిక గట్టిగా కేకలు వేయకుండా, ప్రతిఘటించకుండా ఆమె కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత క్రూరంగా కొట్టారు. అనంతరం ఐదుగురు నిందితులు ఆమెపై విచక్షణారహితంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రక్షించాల్సిన చోటే ఆ చిన్నారికి నరకం కనిపించింది.

యజమాని అప్రమత్తత.. నిందితుల వేట

బాలిక సమయానికి పనిలోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన కేర్ హోమ్ యజమాని వెంటనే గాలింపు చేపట్టింది. స్థానికుల సహాయంతో చుట్టుపక్కల వెతకగా, నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో బాలిక వివస్త్రగా, రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. బాలిక పరిస్థితిని చూసి చలించిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో భవనం పైకప్పు మీద ఉన్న వాటర్ ట్యాంక్ వెనుక దాక్కున్న ఐదుగురు నిందితులను స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు సీతాపూర్ జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించి పోలీసులకు అప్పగించారు.

బాధితురాలికి చికిత్స

తీవ్రంగా గాయపడిన బాలికను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. నిందితులపై పోక్సో (POCSO) చట్టంతో పాటు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు లక్నో పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లకు కఠిన శిక్ష పడాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పనికి వెళ్లే క్రమంలో మైనర్ బాలికపై జరిగిన ఈ దారుణం మహిళా భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu