Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

HashtagU Telugu 1 week ago

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన సహనటికి సరదాగా ఓ సలహా ఇచ్చారు. ‘భారత్ భాగ్య విధాత’ అనే తమ కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా, నటి గిరిజా ఓక్‌ను ఉద్దేశించి “నీ అందాన్ని ఉపయోగించి మన సినిమాను ప్రమోట్ చెయ్యి” అంటూ చమత్కరించారు.

ఇటీవల ‘నేషనల్ క్రష్’గా సోషల్ మీడియాలో వైరల్ అయిన గిరిజా, ఆ ట్యాగ్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగింది?
‘భారత్ భాగ్య విధాత’ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గిరిజా ఓక్ సోషల్ మీడియా పాపులారిటీపై చర్చ జరిగింది. గతేడాది ఓ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన క్లిప్‌లో గిరిజా నీలం రంగు చీరలో కనిపించారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆమెను ‘బ్లూ శారీ గర్ల్’ అని, ‘నేషనల్ క్రష్’ అని పిలవడం ప్రారంభించారు. ఈ విషయం ప్రస్తావనకు రాగానే, కంగనా కూడా “ఆ బ్లూ శారీ సంగతేంటి? నేను కూడా విన్నాను” అని ఆసక్తిగా అడిగారు.

అది నా ఘనత కాదు: గిరిజా
తనకు వచ్చిన ఈ గుర్తింపుపై గిరిజా ఓక్ వినమ్రంగా స్పందించారు. “ఆ వీడియో ఎందుకు వైరల్ అయిందో నాకు అర్థం కాలేదు. అందులో ఎలాంటి లాజిక్ లేదు. చాలా మంది నా అందం గురించి కామెంట్లు చేశారు. కానీ, నా రూపం నా ఘనత కాదు. అది నా జన్యువుల వల్ల వచ్చింది. నా అందంలో నేను సంపాదించుకున్నది ఏమీ లేదు” అని ఆమె వివరించారు.

గిరిజా సమాధానం విన్న కంగనా, “నువ్వు నా సినిమాలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి నీ అందాన్ని ఉపయోగించి సినిమాను ప్రమోట్ చెయ్యి” అని నవ్వుతూ అన్నారు. దీనిపై గిరిజా స్పందిస్తూ, “దేనికైనా ‘నేషనల్’ అని గుర్తింపు రావాలంటే సర్టిఫికెట్ ఉండాలి. కంగనాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సబబే. కానీ నన్ను ‘నేషనల్ క్రష్’ అనడంలో ఎలాంటి ప్రామాణికత లేదు” అని స్పష్టం చేశారు.

మనోజ్ తపాడియా దర్శకత్వం వహించిన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కంగనా రనౌత్, గిరిజా ఓక్‌లతో పాటు స్మితా తాంబే, ఇషా డే, ప్రియా బెర్డే, ఆశా షెలార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu