Dailyhunt
Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

HashtagU Telugu 1 week ago

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక మహానాడుకు వేదిక, తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం.

మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (IKSEZ) ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 6వ తేదీన మహానాడు పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మందికి పైగా పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇఫ్కో సెజ్‌లో దాదాపు 150 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.

మంత్రులు పి. నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతల బృందం జిల్లాలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం, తుది నిర్ణయం తీసుకుని ఈ వేదికను ఖరారు చేసింది. భూమిపూజ అనంతరం సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం ఏర్పాట్లను వేగవంతం చేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu