Dailyhunt
Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

HashtagU Telugu 1 week ago

తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు చేదువార్త చెప్పారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన ‘పాపికొండల విహారయాత్ర’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తుండటంతో, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, పర్యావరణం అనుకూలించిన తర్వాతే విహారయాత్రను పునరుద్ధరిస్తామని యంత్రాంగం వెల్లడించింది. యాత్ర పునఃప్రారంభానికి సంబంధించిన తదుపరి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటివరకు పర్యాటకులు అధికారులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా నదీ ప్రవాహంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu