Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
West Bengal: ఇంటి పనిమనిషి నుంచి చట్టసభకు.. పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన కలితా మాఝీ

West Bengal: ఇంటి పనిమనిషి నుంచి చట్టసభకు.. పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన కలితా మాఝీ

HashtagU Telugu 2 weeks ago

శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 294 స్థానాలకు గానూ 206 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ చారిత్రక గెలుపులో ఎందరో కొత్త ముఖాలు వెలుగులోకి రాగా, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న పేరు కవితా మాజీ. ఒకప్పుడు ఇళ్లలో పనిచేస్తూ నెలకు కేవలం రూ.2,500 సంపాదించిన ఆమె, ఇప్పుడు ఆస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికై అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆమె విజయం ఖరారైన వెంటనే గతంలో ఆమె ఇంటి పనులు చేస్తున్నప్పటి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ ఆమె ప్రస్థానాన్ని కొనియాడారు. “నాలుగు ఇళ్లలో పనిచేస్తూ నెలకు రూ.2,500 సంపాదించే బీజేపీ అభ్యర్థి కవితా మాజీ, ఆస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇదే బీజేపీ శక్తి. ఇక్కడ అత్యంత సామాన్య పౌరులు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి స్ఫూర్తిదాయకమైన చరిత్ర లిఖించగలరు” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఎవరీ కవితా మాజీ?

దాదాపు రెండు దశాబ్దాల పాటు కవితా మాజీ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇళ్లలో పాత్రలు కడుగుతూ, ఇతర పనులు చేశారు. 38 ఏళ్ల కవితా బర్ధమాన్ జిల్లాలోని ఆస్‌గ్రామ్ నివాసి. ఆమె భర్త సుబ్రతా మాజీ రోజువారీ కూలీ. బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన ఆమె, క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లకు చేరువయ్యారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ ప్రసన్న లహోరిపై 12,535 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కవితాకు లక్షకు పైగా ఓట్లు రావడం విశేషం.

గత దశాబ్ద కాలంగా ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బూత్ స్థాయి కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఆమెను బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఆమె దాదాపు 41 శాతం ఓట్లు సాధించినప్పటికీ, సుమారు 12,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పట్టు వదలకుండా పనిచేసి ఈసారి గెలుపును అందుకున్నారు.

ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కవితా మాజీపై తీవ్రమైనవి కాని రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.1,61,216. ఇందులో బ్యాంకు డిపాజిట్లు, చేతిలో ఉన్న నగదు, ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయి. ఆమె భర్త పేరు మీద 871 చదరపు అడుగుల నివాస స్థలం ఉంది. దీనిని ఆయన తండ్రి బహుమతిగా ఇవ్వగా, దాని ప్రస్తుత విలువ సుమారు రూ.3 లక్షలు. ఒక సామాన్య గృహ కార్మికురాలు పట్టుదలతో పనిచేసి శాసనసభకు ఎన్నిక కావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu