Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2026 Tata Tiago EV vs MG Comet EV : రూ. 10లక్షల ధరలోపు రెండు బడ్జెట్​ ఎలక్ట్రిక్​ కార్లు- ఏది బెస్ట్?

2026 Tata Tiago EV vs MG Comet EV : రూ. 10లక్షల ధరలోపు రెండు బడ్జెట్​ ఎలక్ట్రిక్​ కార్లు- ఏది బెస్ట్?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కార్లను (ఈవీ) సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడంలో 'టాటా మోటార్స్', 'ఎంజీ మోటార్స్' ముందంజలో ఉన్నాయి.

ఇటీవలే టాటా సంస్థ సరికొత్త ఫీచర్లతో 2026 టియాగో ఈవీని అప్‌గ్రేడ్ చేయగా.. పట్టణ ప్రాంతాల్లో తిరగడానికి అనువుగా ఉండేలా ఎంజీ సంస్థ తన 'కామెట్ ఈవీ'ని మార్కెట్​లో ఉంచింది. విచిత్రంగా టాటా టియాగో ఈవీ టాప్ వేరియంట్ (క్రియేటివ్), ఎంజీ కామెట్ ఈవీ స్పెషల్ వేరియంట్ (బ్లాక్​స్టార్మ్) రెండూ సరిగ్గా రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఒకే ధర వద్ద లభిస్తున్నాయి. ఒకే బడ్జెట్ అయినప్పటికీ ఈ రెండు ఈవీల పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలను ఇక్కడ పోల్చి చూద్దాము..

1. టాటా టియాగో ఈవీ ఫేస్​లిఫ్ట్ వర్సెస్​ ఎంజీ కామెట్​ ఈవీ- బ్యాటరీ ప్యాక్, పవర్..

2026 టాటా టియాగో ఈవీ: ఈ టియాగో ఈవీ ఫేస్​లిఫ్ట్​లో పెద్దదైన 24-కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ (లాంగ్ రేంజ్) ఉంటుంది. దీనిలోని మోటార్ కారు ముందు యాక్సిల్​పై అమర్చి ఉంటుంది. ఇది గరిష్టంగా 73.75 బీహెచ్​పీ పవర్, 114 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎంజీ కామెట్ ఈవీ: ఇందులో చిన్నదైన 17.3-కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని మోటార్ వెనుక యాక్సిల్​పై అమర్చి ఉండి.. కేవలం 41.43 బీహెచ్​పీ పవర్, 110 ఎన్​ఎం టార్క్‌ను మాత్రమే ఇస్తుంది.

విజేత: పవర్, పర్ఫార్మెన్స్ పరంగా టాటా టియాగో ఈవీ చాలా ముందుంది.

2. టాటా టియాగో ఈవీ ఫేస్​లిఫ్ట్ వర్సెస్​ ఎంజీ కామెట్​ ఈవీ- డ్రైవింగ్ రేంజ్..

ఎలక్ట్రిక్ కార్లలో రేంజ్ అనేది చాలా కీలకం.

టాటా టియాగో ఈవీ: సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 285 కిలోమీటర్ల ప్రయాణ రేంజ్​ని ఆఫర్ చేస్తుంది.

ఎంజీ కామెట్ ఈవీ: సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

విజేత: లాంగ్ రైడ్స్ లేదా ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి 2026 టియాగో ఈవీ బెస్ట్ ఛాయిస్.

3. టాటా టియాగో ఈవీ ఫేస్​లిఫ్ట్ వర్సెస్​ ఎంజీ కామెట్​ ఈవీ- డైమెన్షన్స్..

కొలతలుటాటా టియాగో ఈవీ (ఎంఎం)ఎంజీ కామెట్ ఈవీ (ఎంఎం)
పొడవు3,8252,974
వెడల్పు1,6841,505
ఎత్తు1,5621,640
వీల్‌బేస్2,4002,010

టియాగో ఈవీ పొడవు, వెడల్పులో పెద్దగా ఉండి ప్రాపర్ 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్‌లా ఉంటుంది. కామెట్ ఈవీ ఎత్తు ఎక్కువగా ఉన్నప్పటికీ పొడవు చాలా తక్కువ. కాబట్టి ఇరుకైన సందుల్లో నడపడానికి, పార్కింగ్‌కు కామెట్ చాలా ఈజీగా ఉంటుంది.

4. టాటా టియాగో ఈవీ ఫేస్​లిఫ్ట్ వర్సెస్​ ఎంజీ కామెట్​ ఈవీ- ఫీచర్లు, లగ్జరీ..

రెండు కార్లలోనూ టెక్నాలజీ పరంగా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి:

టాటా టియాగో ఈవీ ఫేస్​లిఫ్ట్ ఫీచర్లు: ఇందులో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే), ఆటోమేటిక్ హెడ్‌లాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోఫోల్డ్ ఓఆర్​వీఎం, రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రియర్ వైపర్ ఉన్నాయి.

ఎంజీ కామెట్ ఈవీ ఫీచర్లు: ఇందులో 10.24-ఇంచుల డిజిటల్ స్క్రీన్, 10.24-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన ట్విన్ డిస్‌ప్లే సెటప్, రోటరీ గేర్ సెలెక్టర్, వైర్‌లెస్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, కీ లెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ కెమెరా, లెథరెట్ సీట్లు, కో-ప్యాసింజర్ సీటును వన్-టచ్‌తో ఫోల్డ్ చేసే ఫీచర్ ఉన్నాయి.

టాటా టియాగో ఈవీ ఫేస్​లిఫ్ట్ వర్సెస్​ ఎంజీ కామెట్​ ఈవీ- ఏ ఎలక్ట్రిక్ కారు కొనాలి?

ఒకే ధర (రూ. 9.99 లక్షల ఎక్స్​షోరూం) ఉన్నప్పటికీ మీ అవసరాల ఆధారంగా కారును ఎంచుకోవాలి:

2026 టాటా టియాగో ఈవీ: మీకు ఫ్యామిలీతో ప్రయాణించడానికి ఎక్కువ స్పేస్, పవర్‌ఫుల్ ఇంజన్, ఎక్కువ రేంజ్ (285 కిమీ), 360-డిగ్రీ కెమెరా లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలనుకుంటే టియాగో ఈవీ క్రియేటివ్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్.

ఎంజీ కామెట్ ఈవీ: ఒకవేళ మీరు కేవలం సిటీ లోపల ఆఫీస్ లేదా వ్యాపార అవసరాల కోసం, ట్రాఫిక్‌లో ఈజీగా దూసుకుపోయేలా, పార్కింగ్ ఇబ్బందులు లేని ఒక స్టైలిష్ ఫ్యూచరిస్టిక్ చిన్న కారును కోరుకుంటే కామెట్ ఈవీ బ్లాక్‌స్టార్మ్ వేరియంట్ మంచి ఛాయిస్ అవుతుంది.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu