Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్ట్​ 8 నుంచి Flipkart Freedom Sale- ఐఫోన్ 17తో పాటు వీటిపై అదిరే డిస్కౌంట్లు..

ఆగస్ట్​ 8 నుంచి Flipkart Freedom Sale- ఐఫోన్ 17తో పాటు వీటిపై అదిరే డిస్కౌంట్లు..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దగ్గర పడుతుండటంతో ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ తీపి కబురు అందించింది. తన భారీ డిస్కౌంట్ ఈవెంట్ 'ఫ్రీడమ్ సేల్ 2026' తేదీలను అధికారికంగా ప్రకటించింది.

ఈ సేల్ ఆగస్టు 8 నుంచి అందరికీ అందుబాటులోకి రానుండగా, ప్లాట్‌ఫామ్‌పై లభించే పలు రకాల డిస్కౌంట్లు, ప్రొడక్ట్ ఆఫర్లకు సంబంధించిన టీజర్ పేజీని కూడా ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే లైవ్ చేసింది.

ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందే ఛాన్స్!

ఈ ఫ్లిప్​కార్ట్​ ఫ్రీడమ్ సేల్ 2026 ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందనే దానిపై ఈ- కామర్స్ దిగ్గజం ఇంకా స్పష్టత ఇవ్వనప్పటికీ, శనివారం (ఆగస్టు 8) నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే, అంటే ఆగస్టు 7 నుంచే సేల్ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. తమ రెగ్యులర్ కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ అందించే ఉత్తమ ప్రయోజనాల్లో ఇది ఒకటి.

ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్​ఛేంజ్ బోనస్..

ఫ్లిప్​కార్ట్​ ఫ్రీడమ్ సేల్​లో భాగంగా కస్టమర్లకు మరింత మేలు చేకూర్చేలా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు ఈ సేల్‌లో ఈఎంఐ, నాన్-ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం ఇన్​స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి తోడు పాత వస్తువులను ఎక్స్​ఛేంజ్ చేసి కొత్తవి కొనుగోలు చేసేవారికి 'అదనపు ఎక్స్​ఛేంజ్ వ్యాల్యూ' కూడా లభిస్తుందని టీజర్ పేజీ స్పష్టం చేస్తోంది.

మరోవైపు కాంపిటీటర్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఆగస్టు 7 నుంచి 'గ్రేట్ ఫ్రీడమ్ సేల్'ను నిర్వహిస్తోంది. ఒకవేళ మీరు వన్‌ప్లస్, ఐకూ, రియల్‌మి నార్జో, లేదా శామ్‌సంగ్ గెలాక్సీ ఎం-సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటే అమెజాన్ ఆఫర్లతో కూడా పోల్చి చూసుకోవడం మంచిది.

ఆకట్టుకునే స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఆఫర్లు..

ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారిక సేల్ ధరలను పూర్తిగా వెల్లడించనప్పటికీ, టీజర్ పేజీలో ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్లను టాప్ డీల్స్‌గా చూపించింది. కాబట్టి వీటిపై భారీగా ధర తగ్గే అవకాశం ఉంది. గెలాక్సీ S25 మోడల్ ఇటీవలే రూ.50,000 మార్కు దాకా తగ్గింది, కాబట్టి ఈ సేల్‌లో దాని ధర మరింత దిగివస్తుందో లేదో చూడాలి.

వీటితో పాటు:

మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్: స్లీక్ లుక్, కర్వ్‌డ్ డిస్​ప్లే, భారీ 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ సోనీ మెయిన్ కెమెరాతో వచ్చే ఈ మిడ్‌రేంజ్ ఫోన్‌పై బెస్ట్ ఆఫర్ రానుంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11+: విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎంతగానో ఉపయోగపడే ఈ ట్యాబ్‌పై కూడా మంచి తగ్గింపు లభించనుంది.

టీవీలు, ల్యాప్‌టాప్‌లు: శాంసంగ్ బ్రాండ్‌కు చెందిన పలు స్మార్ట్ టీవీలు, గెలాక్సీ బుక్ ల్యాప్‌టాప్‌లు డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం మెమరీ చిప్‌ల కొరత వల్ల అప్పుడప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు పెరుగుతున్న తరుణంలో, మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్25, ఒప్పో కే13 టర్బో సిరీస్, రియల్‌మీ పీ3 ఆల్ట్రా వంటి మోడళ్లను కొనాలనుకుంటే ఈ ఫ్లిప్​కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 వరకు వేచి చూడటం తెలివైన నిర్ణయం అవుతుంది.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu