Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్టు 9న అరుదైన మహాలక్ష్మి యోగం - ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఇకపై వెలుగులే! పనులన్నీ చకచకా

ఆగస్టు 9న అరుదైన మహాలక్ష్మి యోగం - ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఇకపై వెలుగులే! పనులన్నీ చకచకా

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు, రాశి పరివర్తనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల రాజైన కుజుడు, మనఃకారకుడైన చంద్రుడు ఒకే రాశిలో చేరినప్పుడు అత్యంత శక్తివంతమైన 'మహాలక్ష్మి యోగం' రూపుదిద్దుకుంటుంది.

శ్రావణ మాసంలో ఏర్పడుతున్న ఈ అరుదైన యోగం అనేక రాశుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సిద్ధంగా ఉంది.

ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. బుధుడికి అధిపతి అయిన మిథున రాశిలోకి ఆగస్టు 2వ తేదీన కుజుడు (అంగారకుడు) ప్రవేశించారు. సరిగ్గా వారం రోజుల తర్వాత, అంటే ఆగస్టు 9వ తేదీన చంద్రుడు కూడా అదే మిథున రాశిలోకి సంచరిస్తారు.

ఇలా ఒకే రాశిలో కుజుడు, చంద్రుడు ముఖాముఖి కలవడంతో లక్ష్మీదేవి అత్యంత ప్రీతిపాత్రమైన మహాలక్ష్మి యోగం, రాజలక్ష్మి యోగాలు ఏర్పడతాయి. పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ కలయిక జరగడం వల్ల నాలుగు రాశుల వారికి విశేషమైన ఆర్థిక లబ్ధి, వృత్తి జీవితంలో అపూర్వమైన యోగం కలగబోతోంది.

మేష రాశి :

మహాలక్ష్మి యోగం ప్రభావంతో మేష రాశి జాతకులకు నూతన అవకాశాలు తలుపు తడతాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కడమే కాకుండా, ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుతాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక పరిస్థితి గతం కంటే ఎంతో మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపై సానుకూల ధోరణితో ముందుకు సాగుతారు.

సింహ రాశి :

కుజ-చంద్రుల సంయోగం సింహ రాశి వారికి అనుకోని సంతోషాలను తెచ్చిపెడుతుంది. కెరీర్‌కు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. మీ ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవడంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు మళ్ళీ పట్టాలెక్కుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పరిపూర్ణ మద్దతు లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, భవిష్యత్ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలుగుతారు.

కన్యా రాశి :

కన్యా రాశి వారికి ఈ యోగం తీవ్రమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని, వేగవంతమైన పురోగతిని అందిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీ స్థానం మరింత బలపడుతుంది. పెండింగ్ పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఆర్థికంగా స్థిరపడతారు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప అవకాశం మీ సొంతమవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగి సంతోషం వెల్లివిరుస్తుంది. నూతన ప్రాజెక్టులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.

మీన రాశి :

ఈ రాశి జాతకులకు రాబోయే రోజులు సువర్ణాక్షరాలతో లిఖించదగినవిగా మారుతాయి. సొంత ఇల్లు, స్థలం లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. దానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబంతో కలసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పాత బకాయిలు వసూలై ఆర్థికంగా పుంజుకుంటారు. నిలిచిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. మీరు వేసే ప్రతి కొత్త అడుగు విజయాన్ని అందిస్తుంది.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu