Dailyhunt
Aditya Dhar: నేషనల్ అవార్డుకు నేనెప్పుడూ సిద్ధమే: ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ కామెంట్ వైరల్

Aditya Dhar: నేషనల్ అవార్డుకు నేనెప్పుడూ సిద్ధమే: ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ కామెంట్ వైరల్

Aditya Dhar: దర్శకుడు ఆదిత్య ధర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్ర సృష్టించాడు. అతని దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది.

మార్చి 19న విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లను సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాను నేషనల్ అవార్డుకు ఎప్పుడూ సిద్ధమే అని ఆదిత్య ధర్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

నేషనల్ అవార్డుకు మేం సిద్ధం!

ప్రముఖ నటుడు రాజ్ జుట్షీ మేనకోడలు సంక్షిత ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించింది. సాధారణంగా సీక్వెల్ సినిమాలు మొదటి భాగం అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుంటాయి. కానీ 'ధురంధర్ 2' ఆ అంచనాలను మించిపోయిందని ఆమె పేర్కొంది.

ఆదిత్య ధర్ ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని, ఆయన ఖచ్చితంగా నేషనల్ అవార్డుకు అర్హులని ఆమె రాసుకొచ్చింది. దీనికి ఆదిత్య ధర్ స్పందిస్తూ.. "నేషనల్ అవార్డుల కోసం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం!" అంటూ ఆత్మవిశ్వాసంతో సమాధానమివ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

విరాట్ - అనుష్కలను కట్టిపడేసిన 'ధురంధర్ 2'

ఈ సినిమా క్రేజ్ సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకూ పాకింది. పవర్‌ఫుల్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఈ సినిమాను చూసి తమ రివ్యూలను పంచుకున్నారు. అనుష్క శర్మ మాట్లాడుతూ.. "దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాను ఇంత గ్రిప్పింగ్‌గా, అద్భుతంగా తీర్చిదిద్దిన ఆదిత్య ధర్ నమ్మకం మెచ్చుకోదగ్గది. రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు" అని కొనియాడింది. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు విరాట్ కోహ్లీ సైతం ఆదిత్య ధర్‌ను ఒక 'జీనియస్' అని అన్నాడు. భారత్‌లో ఇలాంటి సినిమాను ఇప్పటివరకు చూడలేదని, రణవీర్ సింగ్ నటన అద్భుతానికి అతీతంగా ఉందని కోహ్లీ ప్రశంసించాడు. దీనికి ఆదిత్య ధర్ స్పందిస్తూ.. "ఒక తరం మొత్తానికి లెజెండ్ అయిన కోహ్లీ నుంచి ఇలాంటి మాటలు వినడం గర్వంగా ఉంది," అని కృతజ్ఞతలు తెలిపాడు.

11 రోజుల్లోనే పార్ట్ 1 రికార్డులు కనుమరుగు

2025 డిసెంబర్‌లో విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం ఆ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే దాని సీక్వెల్ కేవలం 11 రోజుల్లోనే మొదటి భాగం లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించి సంచలనం సృష్టించింది. రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో.. ఐఎస్ఐ (ISI) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ శంషాద్ హసన్‌గా రాజ్ జుట్షీ పోషించిన విలన్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి 'ధురంధర్ 2' ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌గా నిలిచింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'ధురంధర్: ది రివెంజ్' ఎప్పుడు విడుదలయ్యింది?

జవాబు: ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

ప్రశ్న: ధురంధర్ 2 మూవీలో ప్రధాన పాత్రలు ఎవరు పోషించారు?

జవాబు: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా.. అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాజ్ జుట్షీ కీలక పాత్రలు పోషించారు.

ప్రశ్న: విరాట్ కోహ్లీ ధురంధర్ 2 సినిమా గురించి ఏమన్నారు?

జవాబు: ఇదొక కనివిని ఎరుగని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని, దర్శకుడు ఆదిత్య ధర్ ఒక జీనియస్ అని కోహ్లీ ప్రశంసించారు.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu