Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Aditya Dhar Yash: యశ్‌తో ధురంధర్ డైరెక్టర్ చేతులు కలుపుతున్నాడా? ఇన్‌స్టా పోస్ట్‌తో సోషల్ మీడియాలో రచ్చ

Aditya Dhar Yash: యశ్‌తో ధురంధర్ డైరెక్టర్ చేతులు కలుపుతున్నాడా? ఇన్‌స్టా పోస్ట్‌తో సోషల్ మీడియాలో రచ్చ

Aditya Dhar Yash: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నెగటివ్ టాక్‌ను ఎదుర్కొంటోంది.

కేజీఎఫ్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ కావడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఈ కష్ట సమయంలో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఆదిత్య ధర్ యశ్‌కు ఓపెన్‌గా సపోర్ట్ చేస్తూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

'టాక్సిక్' ట్రోలింగ్.. యశ్ పిక్‌తో ఆదిత్య ధర్ స్పెషల్ పోస్ట్

బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు భారీగా పడిపోవడంతో పాటు కంటెంట్ బాలేదంటూ నెటిజన్లు యశ్ ను టార్గెట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి సీనియర్ డైరెక్టర్లు కూడా ఈ సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేస్తుండగా, బాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ధైర్యంగా ముందుకు వచ్చారు.

ఆదిత్య ధర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో యశ్ ఫోటోను షేర్ చేస్తూ.. సింపుల్‌గా "Yash" అని రాసి, పక్కన మజిల్ పవర్(), రెడ్ హార్ట్ (❤️) ఎమోజీలను యాడ్ చేశారు. ఎలాంటి సుదీర్ఘమైన రివ్యూలు రాయకుండా, కేవలం ఆ రెండు ఎమోజీలతో యశ్ వర్క్‌ను, ఆయన కష్టాన్ని గౌరవిస్తున్నట్లు స్పష్టం చేశారు. నెగెటివిటీ మధ్య ఒక పాన్ ఇండియా స్టార్‌కి ఇంకో టాప్ డైరెక్టర్ ఇలా బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఇప్పుడు నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ధురంధర్ క్లాష్ కథేంటి?

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్: ది రివేంజ్', యశ్ 'టాక్సిక్' సినిమాలు మొదట బాక్సాఫీస్ దగ్గర నేరుగా పోటీ పడాల్సి ఉంది. మార్చి 19న ఈ రెండూ ఒకేసారి రిలీజ్ కానున్నాయని అనౌన్స్ చేశారు.

తర్వాత గల్ఫ్ రీజియన్ ప్రొడక్షన్ ఇష్యూస్, మిడిల్ ఈస్ట్ మార్కెట్ ప్రాబ్లమ్స్ వల్ల టాక్సిక్ రిలీజ్ ఆగస్టుకు వాయిదా పడింది. దాంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పినప్పటికీ, రెండు సినిమాల మధ్య పోలికలు మాత్రం ఆగలేదు. 'ధురందర్ 2' దాదాపు ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేయగా, 'టాక్సిక్' మాత్రం రూ.100 కోట్ల ఓపెనింగ్ తర్వాత దారుణమైన డ్రాప్ చూసింది.

యశ్, ఆదిత్య కాంబోలో సినిమా వస్తుందా?

గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో వచ్చిన 'టాక్సిక్' సినిమాలోని హద్దులు లేని వయొలెన్స్, ఎమోషన్ లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచాయి. అయితే ఆదిత్య ధర్ మాత్రం యశ్ పడ్డ కష్టాన్ని గుర్తించి ప్రశంసించడం కన్నడ ఫ్యాన్స్‌కు పెద్ద ఊరటనిచ్చింది.

పోటీ ఉన్నప్పటికీ, తోటి మేకర్ పనితనాన్ని గౌరవించే ఆదిత్య ధర్ కల్చర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో భవిష్యత్తులో ఒక బిగ్ స్కేల్ యాక్షన్ థ్రిల్లర్ వస్తే బాగుంటుందని కన్నడ, హిందీ ఆడియన్స్ కోరుకుంటున్నారు.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu