Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amba's Revenge Teaser: మైథలాజికల్ థ్రిల్లర్‌గా అంబా'స్ రివెంజ్.. మొట్టమొదటి తెలుగు ఏఐ సినిమా.. టీజర్ రిలీజ్

Amba's Revenge Teaser: మైథలాజికల్ థ్రిల్లర్‌గా అంబా'స్ రివెంజ్.. మొట్టమొదటి తెలుగు ఏఐ సినిమా.. టీజర్ రిలీజ్

Amba's Revenge Teaser Released: నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఏఐ (AI) చిత్రం "అంబా'స్ రివెంజ్".

ప్రమోద్ ఎంసి సంగీతం అందించిన ఈ ఏఐ చిత్రానికి హ్యారీ బ్రెయిన్ ఎడిటింగ్ అండ్ డీఐ చేయగా కిషోర్ కుమార్ ఏనుగు డైలాగ్స్, లిరిక్స్ అందించారు.

మహాభారతంలోని అంబ ప్రతీకారం

ప్రస్తుతం ప్రజలకు చేరువ అవుతున్న లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందిన ఈ విజువల్ ఫీస్ట్ చిత్రం భారత దేశపు ఇతిహాసాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా తెరకెక్కించారు. మహాభారతంలో భీష్ముని వల్ల ఒక జన్మలో మరణించిన కారణం, మరో జన్మలో భీష్మునిపై ఆమె పగ తీర్చుకున్న ప్రయాణాన్ని చూపించే దిశగా ఈ చిత్రం ఉంటుంది.

అంబా'స్ రివేంజ్ టీజర్ రిలీజ్

మనుషులు ఎవరు నటించకుండా కేవలం ఏఐ ద్వారా రూపొందించిన అంబా'స్ రివెంజ్ సినిమా టీజర్ తాజాగా మీడియా సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా విజువల్ డైరెక్టర్ సాయి నేత మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సపోర్ట్ అందిస్తున్న అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ప్రేక్షకులు అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

అలాగే, సంగీత దర్శకుడు ప్రమోద్ ఎంసీ మాట్లాడుతూ... "మహాభారతంలోని ఒక అంశాన్ని తీసుకుని సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాము. మీడియా వారి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము" అని కోరారు.

ఈ సినిమాలో 2 పాటలుంటాయి

"నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో 2 పాటలు ఉంటాయి. నేటి తరానికి అర్థం అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకి ఎక్కించడం జరిగింది" అని డైలాగ్స్, లిరిక్స్ రైటర్ కిషోర్ కుమార్ ఏనుగు చెప్పారు.

"నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ప్రస్తుతం వస్తున్న కొన్ని ఏఐ రీల్స్ వల్ల ప్రేక్షకులకు ఏఐ సినిమా అంటే ఒక అవగాహన ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా మంచి విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. అందరూ సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు ఎడిటర్ హ్యారీ బ్రెయిన్.

చాలా ఖర్చుతో కూడింది

"ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. నాకు అవకాశం ఇచ్చి, చిత్రంలో నాకు సపోర్ట్ అందించిన చిత్ర బృందం అందరికీ థాంక్స్" అని క్యారెక్టర్ డిజైనర్ చందు గోసంగి తెలిపారు.

నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఏఐలో సినిమా చేయడం చాలా ఖర్చుతో కూడిన విషయం. సాధారణంగా ఇటువంటి సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అనుకుంటారు. కానీ మేము ఒక టూల్ ఉపయోగించేలోపు మరొక టూల్ వస్తుంది. అలా ఖర్చు ఎక్కువ అయింది. ప్రస్తుతం అందరూ రీల్స్‌లో ఏఐ చూస్తున్నారు కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది" అని ధీమా వ్యక్తం చేశారు.

శిఖండి నుంచి చూస్తాం

దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ... "సినిమా అంబ అయినప్పటికీ ఈ సినిమా శిఖండి నుంచి చూడబోతున్నాము. సినిమాలో ప్రముఖ పాత్రలు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది. టీజర్‌లో డైలాగ్స్ కూడా లేవు, త్వరలో ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాము" అని పేర్కొన్నారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu