Dailyhunt
Anchor Geetha Bhagat: కొత్త నటీనటులకు అండగా టాలీవుడ్ యాంకర్ గీతా భగత్.. 'ఆరెంజ్ కాస్టింగ్'తో మరో ముందడుగు!

Anchor Geetha Bhagat: కొత్త నటీనటులకు అండగా టాలీవుడ్ యాంకర్ గీతా భగత్.. 'ఆరెంజ్ కాస్టింగ్'తో మరో ముందడుగు!

Anchor Geetha Bhagat Orange Casting Agency: టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు అనగానే ఇప్పుడు ఠక్కున గుర్తొచ్చే పేర్లలో గీతా భగత్ కూడా ఒకరు అని చెప్పాలి.

యాంకర్ సుమ తర్వాత ఆ రేంజ్‌లో వాక్చాతుర్యంతో ఆకట్టుకునే యాంకర్ ఈమెనే అనడంలో ఎటువంటి సందేహం లేదని టాలీవుడ్‌లో మంచి టాక్ నడుస్తోంది.

స్టార్స్‌ను ఇబ్బంది పెట్టకుండా

డీసెంట్‌గా, హుందాగా ఈవెంట్స్‌ను హ్యాండిల్ చేయడం గీతా భగత్ స్టైల్. అంతేకాకుండా తనదైన పంచులతో, స్టార్స్‌ను ఇబ్బంది పెట్టకుండా క్రేజీ ఆన్సర్స్ రాబట్టడంలో కూడా గీతా భగత్‌కు మంచి పేరుంది. టాలవుడ్ యాంకర్‌గా కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

ఆరెంజ్ క్యాస్టింగ్ ఏజెన్సీ

సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండి, సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గీతా భగత్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. టాలెంట్ ఉన్న కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు 'ఆరెంజ్ కాస్టింగ్'(Orange Casting) పేరుతో ఒక కాస్టింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గీతా భగత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

'ఆరెంజ్ కాస్టింగ్' లోగో షేర్ చేస్తూ

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆరెంజ్ కాస్టింగ్' లోగోను షేర్ చేస్తూ గీతా భగత్ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. మంచి విషయాలను అనౌన్స్ చేయడానికి కాస్త లేట్ అయినా పర్వాలేదని చెబుతూ.. "ఆరెంజ్ కాస్టింగ్"ను అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని గీతా భగత్ పేర్కొన్నారు.

కొత్త టాలెంట్‌ను వెతికి పట్టుకుని

"మా ఈ ప్రయాణం ఎప్పుడో మొదలైంది. కొత్త ముఖాలను, టాలెంట్‌ను వెతికి పట్టుకుని.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో వాళ్లకు అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం" అని యాంకర్ గీతా భగత్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అలాగే "ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. ఫ్యూచర్‌లో అదిరిపోయే అప్‌డేట్స్ రాబోతున్నాయి" అంటూ నెటిజన్లలో మరింత క్యూరియాసిటీ పెంచారు బ్యూటిఫుల్ యాంకర్ గీతా భగత్.

ఇండస్ట్రీ వర్గాల అభినందనలు

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి గీతా భగత్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు, ఇండస్ట్రీ వర్గాలు అభినందనలు తెలుపుతున్నాయి. ఈ కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా టాలీవుడ్‌కు ఎంతమంది కొత్త యాక్టర్స్ పరిచయం అవుతారో చూడాలి.

టాక్ షోలలో యాక్టివ్ యాంకరింగ్

ఇదిలా ఉంటే, తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్లకు కొదవ లేదు. కానీ, తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకోవడంలో గీతా భగత్ సక్సెస్ అయ్యారు. ఆడియో లాంచ్‌లు, సినిమా ఈవెంట్సే కాకుండా బుల్లితెరపై వచ్చే టాక్ షోలలో తన యాక్టివ్ యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు గీతా భగత్.

సోషల్ మీడియా సెన్సేషన్

కేవలం మాటకారి తనమే కాదు, సమయస్ఫూర్తితో గీత చేసే వ్యాఖ్యానాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గీతా భగత్ మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే, గీతా భగత్ కేవలం టీవీ షోలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

గ్లామరస్ ఫొటోషూట్స్

గీతా భగత్ గ్లామరస్ ఫోటోషూట్‌లు, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే షూటింగ్ విశేషాలతో నెటిజన్లను అలరిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నటీనటులతో గీతా భగత్ చేసే ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu