Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందరిదీ ఒకే ఒక్క ప్రశ్న.. దళపతి విజయ్ ఎవరితో చేతులు కలుపుతారు?

అందరిదీ ఒకే ఒక్క ప్రశ్న.. దళపతి విజయ్ ఎవరితో చేతులు కలుపుతారు?

ధ్యాహ్నం 2:11 గంటల సమయానికి అందిన ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఏకంగా 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఒకవేళ విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటారు?

1. 'సొంతంగానే పీఠం' - టీవీకే ధీమా

టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ తాజా ప్రకటన ప్రకారం.. "టీవీకే తన సొంత బలం మీదనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది." డీఎంకే ఇన్నాళ్లూ ఒక చీకటి గదిలో పరుగెడుతోందని, ఇప్పుడు వారికి వాస్తవం తెలిసి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతానికి విజయ్ పార్టీ ఎవరి మద్దతు కోరాల్సిన అవసరం లేనంత మెజారిటీని సాధిస్తోందని చెప్పారు.

2. 'నో కాంప్రమైజ్' - విజయ్ సిద్ధాంతం

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి విజయ్ ఒకే మాటపై నిలబడ్డారు. ఇది కేవలం ఎన్నికల పోరాటం కాదు, ఒక "ప్రజాస్వామ్య యుద్ధం" అని ఆయన అభివర్ణించారు.

తమ రాజకీయ సిద్ధాంతాలను ఎవరి కోసం, దేని కోసం రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేల మార్క్ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగానే టీవీకే పుట్టుకొచ్చింది కాబట్టి, ఆ పార్టీలతో చేతులు కలిపితే పార్టీ ఉనికికే ప్రమాదమని విజయ్ భావిస్తున్నారు.

3. బీజేపీ ఒత్తిడిని సైతం ఎదిరించి..

ఎన్నికలకు ముందు టీవీకేను తమ కూటమిలోకి లాగాలని బీజేపీ ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. కానీ, విజయ్ ఏమాత్రం తలొగ్గకుండా ఫిబ్రవరిలోనే తన వైఖరిని స్పష్టం చేశారు. తాము బీజేపీతో సహా ఏ ఇతర ప్రధాన పార్టీలతోనూ పొత్తు పెట్టుకోమని ఖరాఖండిగా చెప్పారు.

ఒకవేళ మెజారిటీ తగ్గితే పరిస్థితి ఏమిటి?

అనధికార అంచనాల ప్రకారం 122 సీట్లతో అధికారంలో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తుది ఫలితాల్లో ఆ సంఖ్య 118 కంటే తగ్గితే (హంగ్ ఏర్పడితే) విజయ్ ముందు మూడు ఆప్షన్లు ఉంటాయి:

  • కాంగ్రెస్ లేదా చిన్న పార్టీల మద్దతు:డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ లేదా పీఎంకే వంటి పార్టీల సాయం తీసుకోవడం.
  • బయటి నుండి మద్దతు: ఏ కూటమిలోనూ చేరకుండా, కేవలం ప్రభుత్వం పడిపోకుండా ఇతర చిన్న పార్టీల మద్దతు పొందడం.
  • విపక్షంలో కూర్చోవడం: మెజారిటీ రాకపోతే పంతానికి పోయి విపక్షంలో కూర్చోవడం. కానీ, విజయ్ పొలిటికల్ ఇమేజ్‌కి ఇది పెద్ద రిస్క్.
పార్టీప్రస్తుత ఆధిక్యంమెజారిటీకి కావాల్సినవిపొత్తు అవకాశం
TVK (విజయ్)1108వేచి చూడాలి
AIADMK5464టీవీకే తిరస్కరించింది
DMK3484ప్రధాన ప్రత్యర్థి

విజయ్ ప్రచార శైలి, ఆయన పార్టీ నాయకుల మాటలను బట్టి చూస్తే, టీవీకే "కింగ్ మేకర్" పాత్రను కాకుండా నేరుగా "కింగ్" స్థానాన్నే కోరుకుంటోంది. ఒకవేళ నంబర్లు అటు ఇటు అయినా, దశాబ్దాలుగా తాము వ్యతిరేకిస్తున్న ద్రవిడ పార్టీలతో విజయ్ చేతులు కలిపే అవకాశం దాదాపు శూన్యం.

డీఎంకే కూటమి లేదా అన్నా డీఎంకే కూటమిలోని చిన్న పార్టీలు విడిగా విజయ్ కు మద్దతు ఇస్తే తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu