Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anganwadi Recruitment : రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు - నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Anganwadi Recruitment : రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు - నోటిఫికేషన్ పూర్తి వివరాలు

Rangareddy Anganwadi Recruitment 2026 : రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం 125 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రమతి శాంతి శ్రీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం… మొదటి దశలో ఈ అంగన్‌వాడీ టీచర్ ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5:00 గంటల లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు…

  • ఆమనగల్: 31 పోస్టులు
  • చేవెళ్ల: 29 పోస్టులు
  • ఇబ్రహీంపట్నం: 21 పోస్టులు
  • షాద్ నగర్: 26 పోస్టులు
  • మహేశ్వరం: 10 పోస్టులు
  • శేరిలింగంపల్లి: 5 పోస్టులు
  • హయత్ నగర్: 3
  • పోస్టులు మొత్తం ఖాళీలు: 125

అభ్యర్థిని తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణురాలై ఉండాలి. 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి. గ్రామ పంచాయతీ పరిధిలో అయితే సంబంధిత గ్రామానికి, పట్టణ/మున్సిపాలిటీ ప్రాంతాల్లో అయితే ఆయా వార్డుకు చెందిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఉప-ప్రణాళిక నివాస ప్రాంతాల పోస్టులకు అదే నివాస ప్రాంతానికి చెందిన వారే అర్హులు. వినికిడి పరికరం ఉపయోగించేవారు, సహాయకుడితో విధి నిర్వహణ చేయగల అంధత్వం ఉన్నవారు మరియు పూర్వ ప్రాథమిక విద్యను బోధించగల కాళ్లు, చేతుల వైకల్యం ఉన్నవారు కూడా రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు వయస్సు ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, నివాస ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. వితంతువు, అనాథ, దివ్యాంగులు, ఈడబ్యూఎస్ లేదా స్పోర్ట్స్ కేటగిరీకి చెందిన వారైతే సంబంధిత పత్రాలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న మహిళలు తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ wdcw.tg.nic.in సందర్శించి పూర్తి సమాచారాన్ని పరిశీలించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu