Dailyhunt
Anil Ravipudi: ఇద్దరు అమ్మాయిలు బ్లాక్ బస్టర్ కొట్టారంటే హ్యాట్యాఫ్- అనిల్ రావిపూడి కామెంట్స్- ఐపీఎల్ సీజన్‌లోనూ అంటూ!

Anil Ravipudi: ఇద్దరు అమ్మాయిలు బ్లాక్ బస్టర్ కొట్టారంటే హ్యాట్యాఫ్- అనిల్ రావిపూడి కామెంట్స్- ఐపీఎల్ సీజన్‌లోనూ అంటూ!

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. ఈ సినిమాలో సంగీత్ శోభన్‌కు జోడీగా హీరోయిన్ నయన్ సారిక నటించింది.

హారర్ కామెడీ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు.

రాకాస సమ్మర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్

మెగా డాటర్ నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి రాకాస చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన రాకాస సినిమా ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 5) రాకాస సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి హిట్ మెషిన్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం రాకాస సక్సెస్ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతోపాటు సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఐపీఎల్ సీజన్‌లోనూ

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "'రాకాస' టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి. నిహారిక చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఓ మూవీని ఆడియెన్స్‌కి ఎంత వరకు రీచ్ చేయాలో, ఎలా ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేశారు. ఐపీఎల్ సీజన్‌లోనూ 'రాకాస' కోసం ఆడియెన్స్ వస్తుండటం గొప్ప విషయం" అని అన్నారు.

పగలబడి నవ్వేశాను

"కామెడీ ఉంటే జనాలు కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమాని చూస్తారు. నేను ఇంకా ఈ మూవీని చూడలేదు. కాకపోతే చాలా ఎపిసోడ్స్ చూశాను. అవి చూస్తేనే సంగీత్, గెటప్ శ్రీను, నయన్, వెన్నెల కిషోర్ గారి కామెడీ చూసి పగలబడి నవ్వేశాను. అనుదీప్ బీజీఎమ్, పాటలు బాగున్నాయి" అని అనిల్ రావిపూడి తెలిపారు.

ఇద్దరు అమ్మాయిలు కలిసి

"ఓ అమ్మాయి (మానస శర్మ) డైరెక్టర్‌గా వచ్చి ఇంకో అమ్మాయి (నిహారిక కొణిదెల) నిర్మాతగా నిలబడి.. బ్లాక్ బస్టర్ కొట్టారంటే హ్యాట్సాఫ్. వారిద్దరూ అలా ముందుకు వెళ్తూనే ఉండాలి" అని ఇద్దరు అమ్మాయిలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

సంగీత్ కామెడీ టైమింగ్

"మానస శర్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. సంగీత్ ఇలానే కంటిన్యూగా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. సమ్మర్‌లో రాబోతోన్న అన్ని చిత్రాల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆకాంక్షించారు.

ఆ విజువల్స్ చూస్తే

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ .. "'రాకాస'ని సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక, మానస శర్మకు థాంక్స్. థియేటర్లో చిన్న వాళ్లు, పెద్ద వాళ్లు మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే నాకెంతో సంతోషంగా అనిపించింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్" అని అన్నారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu