Dailyhunt
AP BRAGCET Result : 6 - 10వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

AP BRAGCET Result : 6 - 10వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

పీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో అడ్మిషన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పై మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఐదో తరగతితో పాటు జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా 6,7,8,9, 10వ తరగతి బ్యాక్ లాగ్ తో పాటు ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

మార్చి 1వ తేదీన ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు 6,7,8,9,10వ తరగతిలో సీట్లను కేటాయిస్తారు. అంతేకాకుండా ఐఐటీ, నీట్ పరీక్షలు రాసి క్వాలిఫై అయిన వారికి ఉచితంగా కోచింగ్ ఇస్తారు. ఇందుకు సంబంధించి ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

AP BRAGCET 2026 ఫలితాలు - ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా

  • ముందుగా https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలోని 6 నుంచి 10వ తరగతి పరీక్ష, ఐఐటీ, నీట్ ఆప్షన్లు ఉంటాయి.
  • ఆయా ఆప్షన్ల కింద ఉండే ఫలితాల లింక్ పైక్లిక్ చేయాలి.
  • ఇక్కడ విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చాను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే విద్యార్థి స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రాథమిక కీ కాపీని పొందొచ్చు.
  • అడ్మిషన్ ప్రాసెస్ లో ర్యాంక్ కార్డు చాలా కీలకం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

AP BRAGCET ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు. గత కొంతకాలంగా గురుకుల సీట్ల కోసం తెగ డిమాండ్ ఉంటోంది. చాలా మంది తల్లిదండ్రులు… వారి పిల్లలను గురుకులాల్లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇటీవలనే 5వ తరగతితో పాటు జూనియర్ ఇంటర్ ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. వీటికి సంబంధించి త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. సీట్లు పొందే విద్యార్థులు… ఆయా స్కూళ్లు, కాలేజీల్లో రిపోర్టింగ్ చేస్తేనే సీటు కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ ను చూస్తూ ఉండాలి.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu