Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP D-Pharmacy 2026 : ఆంధ్రప్రదేశ్‌ డి.ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్.. ఆగస్టు 31 నుంచి స్టార్ట్

AP D-Pharmacy 2026 : ఆంధ్రప్రదేశ్‌ డి.ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్.. ఆగస్టు 31 నుంచి స్టార్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharmacy) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది.

AP D-PHARMACY 2026 అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఆగస్టు 31, 2026 నుండి సెప్టెంబర్ 05, 2026 వరకు ఉంటుంది. హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 02 నుండి సెప్టెంబర్ 05 వరకు చేస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసేందుకు గడువు సెప్టెంబర్ 03 నుండి సెప్టెంబర్ 06 దాకా ఉంటుంది. వెబ్ ఆప్షన్లలో మార్పులకు సెప్టెంబర్ 07న అవకాశం కల్పిస్తారు.

సెప్టెంబర్ 09న సీట్ల కేటాయింపు ఉంటుంది. కాలేజీల్లో రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 10 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

కౌన్సెలింగ్ ఆన్‌లైన్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన ఫీజులు:OC / BC అభ్యర్థులకు రూ. 1,250, SC / ST అభ్యర్థులకు రూ. 650గా ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు.

అభ్యర్థులు కౌన్సెలింగ్ ఆన్‌లైన్ ప్రక్రియ, హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లే సమయంలో పలు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. AP D.PHARMACY-2026 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, అభ్యర్థి ఆధార్ కార్డ్ , పదో తరగతి మార్కుల మేమో, ఇంటర్మీడియట్ మార్కుల మేమో, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, EWS సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రంలాంటి పత్రాలు ఉండాలి.

వికలాంగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు, NCC, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో-ఇండియన్ అభ్యర్థులకు ప్రత్యేకంగా విజయవాడలోని బెంచ్ సర్కిల్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ సెంటర్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రత్యేక వెరిఫికేషన్ తేదీ సెప్టెంబర్ 05, 2026న ఉదయం 9:00 గంటల నుండి ఉంటుంది.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫీజు ఏడాదికి రూ. 4,700, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫీజు ఏడాదికి రూ. 25,000, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. జూలై 1, 2026 నాటికి గరిష్ట వయోపరిమితి SC/ST/BC అభ్యర్థులకు 29 సంవత్సరాలు, ఓసీ అభ్యర్థులకు 25 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు.

అభ్యర్థులు కౌన్సెలింగ్ సమాచారం, ఆప్షన్ల నమోదుకు కేవలం అధికారిక వెబ్‌సైట్ https://polycet.ap.gov.in ను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఏదైనా సహాయం లేదా సాంకేతిక సమస్యల కోసం 7842075469, 7842085469, 7842095469 హెల్ప్‌లైన్ నంబర్లను ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 గంటలలోపు సంప్రదించవచ్చు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu