Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP ICET 2026 Counselling : ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు, ఈనెల 7న సీట్ల కేటాయింపు

AP ICET 2026 Counselling : ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు, ఈనెల 7న సీట్ల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.

అర్హులైన అభ్యర్థులు తమకు కావలసిన కళాశాలలను ఎంచుకోవడానికి ఉద్దేశించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇంకా ఆప్షన్లు నమోదు చేసుకోని విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ( https://cap.apcfss.in/ ) ద్వారా తమ ప్రాధాన్యతలను సమర్పించాల్సి ఉంటుంది.

వెబ్ ఆప్షన్లను ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు తమ ప్రాధాన్యతల్లో ఏవైనా మార్పులు లేదా సవరణలు చేసుకోవాలనుకుంటే ఉన్నత విద్యామండలి వారికి ప్రత్యేకావకాశం కల్పించింది. సెప్టెంబర్ 3న ఒక్క రోజు మాత్రమే ఆప్షన్ల మార్పుచేర్పులకు అనుమతినిస్తారు.

ఈనెల 7న సీట్ల కేటాయింపు…

అభ్యర్థులు ఐసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ర్యాంకు, వారి సామాజిక వర్గాల రిజర్వేషన్లు మరియు వెబ్ ఆప్షన్లలో ఇచ్చే ప్రాధాన్యతల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 7వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు.

సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ జాయినింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై తమ అసలు సర్టిఫికెట్లను సమర్పించి రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల విభాగం ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లోనూ సెప్టెంబర్ 8 నుంచే నూతన విద్యాసంవత్సరం (2026-27) తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 23,198 మంది పరీక్షకు హాజరయ్యారు. వెలువడిన ఫలితాల్లో ఏకంగా 21,205 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత పొందారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu