Dailyhunt
Atlee on Raaka: ఇది కేవలం సినిమా కాదు.. నా 18 ఏళ్ల కల.. ఇది ఆరంభం మాత్రమే.. హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్ సర్: అట్లీ

Atlee on Raaka: ఇది కేవలం సినిమా కాదు.. నా 18 ఏళ్ల కల.. ఇది ఆరంభం మాత్రమే.. హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్ సర్: అట్లీ

Atlee on Raaka: పుష్ప సెన్సేషన్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇది కేవలం సినిమా కాదు, 18 ఏళ్ల నిరీక్షణ అని అట్లీ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా రాకా మూవీ గురించిన చర్చే జరుగుతోంది.

ఊహించని షాక్.. ఊరమాస్ లుక్

ప్రేక్షకులు ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో, వాటిని తలకిందులు చేస్తూ 'రాకా' ఫస్ట్ లుక్ విడుదలైంది. అల్లు అర్జున్ ఇప్పటివరకు పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా, అసలు గుర్తుపట్టలేనంత కొత్తగా ఇందులో కనిపిస్తున్నాడు.

గుండుతో, అత్యంత క్రూరమైన కళ్లతో, ఒక చేతికి తోడేలు పంజాలాంటి కవచంతో ఉన్న బన్నీ లుక్ చూస్తుంటే.. ఇది ఒక డార్క్ సినిమాటిక్ ఎక్స్‌పెరిమెంట్ అని స్పష్టమవుతోంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి అల్లు అర్జున్ చేస్తున్న ఈ సాహసం టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది.

అట్లీ 18 ఏళ్ల తపస్సు

ఈ రాకా సినిమా కేవలం ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, దర్శకుడు అట్లీ వ్యక్తిగత కల. ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా అట్లీ ఎక్స్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.

"గడిచిన 18 ఏళ్లుగా ఈ ఆలోచనను నా గుండెల్లో దాచుకున్నాను. ఎప్పుడూ చెదిరిపోనివ్వలేదు. అది నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరుతోంది. నిజం చెప్పాలంటే.. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సర్" అని అట్లీ పేర్కొన్నాడు.

దీనిని బట్టి చూస్తుంటే అట్లీ తన కెరీర్ మొదలుపెట్టకముందు నుంచే ఈ కథను సిద్ధం చేసుకున్నారని అర్థమవుతోంది. సుమారు రెండు దశాబ్దాల పాటు ఈ విజన్‌ను కాపాడుకుంటూ రావడం అంటే ఈ సినిమాలో కచ్చితంగా ఏదో బలమైన ముడి ఉండే ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

గ్లోబల్ రేంజ్‌లో 'రాకా' హంగామా

సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాకుండా 2027 మధ్యలో ఏకంగా 7 భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తెలుగు ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి

సాధారణంగా అట్లీ సినిమాలు కమర్షియల్ ఫార్ములాతో సాగుతాయి. కానీ 'రాకా' విషయంలో అతడు పూర్తి డార్క్ థీమ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు 'రాకా'తో గ్లోబల్ మార్కెట్‌పై కన్నేశాడు.

ఈ పోస్టర్‌లో బన్నీ చేతికి ఉన్న పంజాని చూస్తుంటే, ఇందులో ఏదైనా 'వైల్డ్' ఎలిమెంట్ లేదా సూపర్‌నేచురల్ అంశం ఉందా అనే కోణంలో ఫ్యాన్స్ థియరీలను అల్లేస్తున్నారు. గతంలో దీపికా లుక్ కూడా ఎంతో ఆసక్తి రేపిన విషయం తెలిసిందే.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రాకా సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతోంది?

ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రకారం, అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా గుండుతో, రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది ఒక డార్క్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.

2. ఈ సినిమాకి 'రాకా' అనే పేరు పెట్టడానికి కారణం ఏంటి?

'రాకా' అంటే సంస్కృతంలో పున్నమి చంద్రుడు లేదా ఒక శక్తివంతమైన ధ్వని అని అర్థం వస్తుంది. అయితే సినిమాలో ఈ పేరుకి ఉన్న అసలు నేపథ్యం ఏంటనేది అట్లీ త్వరలోనే రివీల్ చేయనున్నారు.

3. రాకా సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2027 మధ్యలో 7 ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

4. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ నటిస్తున్నారు.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu