Dailyhunt
Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్.. కాబోయే భార్యపై ఎమోషనల్ పోస్ట్.. బ్యూటిఫుల్ అంటూ కాజల్ కామెంట్

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్.. కాబోయే భార్యపై ఎమోషనల్ పోస్ట్.. బ్యూటిఫుల్ అంటూ కాజల్ కామెంట్

Bellamkonda Srinivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనిపై తాజాగా మంగళవారం (ఏప్రిల్ 7) అతడు ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు.

ఈ క్షణం నుంచి అంతా మారిపోయింది అంటూ అతడు చేసిన ఎమోషనల్ పోస్ట్ చాలా మందిని ఆకర్షిస్తోంది. కాజల్ కూడా దీనిపై స్పందిస్తూ బ్యూటీఫుల్ అని కామెంట్ చేసింది.

"ఈ క్షణం నుండి అంతా మారిపోయింది.."

బెల్లంకొండ శ్రీనివాస్ తన నిశ్చితార్థ వేడుక ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాశాడు. "ఈ క్షణం నుండి ప్రతిదీ మారిపోయింది.. నిండు మనసులతో, ఒకరి కళ్లలో ఒకరం చూసుకుంటూ మేము ఎప్పుడూ నమ్మే ఒక శాశ్వతమైన బంధంలోకి అడుగుపెట్టాం. ఎటువంటి హడావుడి, ఆర్బాటం లేకుండా.. కేవలం మా మధ్య ఉన్న ప్రేమతో ఈ వేడుక ఎంతో అందంగా జరిగింది. ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం" అని అతడు అన్నాడు. 'అజూర్ కోవ్' (Azure Cove) అనే అందమైన ప్రదేశంలో ఈ వేడుక జరిగినట్లు అతడు ట్యాగ్ చేశాడు.

బ్యూటీఫుల్ అన్న కాజల్

బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఈ పోస్ట్ పై ఎంతో మంది అభిమానులతోపాటు కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ లాంటి హీరోయిన్లు కూడా స్పందించారు. బ్యూటీఫుల్ అంటూ కామెంట్ చేసిన కాజల్.. ఓ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది.

అటు ప్రగ్యా కూడా మూడు హార్ట్ ఎమోజీలతో ఈ పోస్టుపై రియాక్ట్ అయింది. ఇక ఎంతో మంది అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేశారు. ఈ ఫొటోల్లో శ్రీనివాస్ తన కాబోయే భార్యను చూస్తూ ఎంతో ఆనందంగా కనిపించాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ కాబోయే భార్య

బెల్లకొండ శ్రీనివాస్ తన కాబోయే భార్య కావ్యను గతంలోనే పరిచయం చేశాడు. వాళ్లకు ఎంగేజ్‌మెంట్ ఎప్పుడో జరిగిపోయిందని వార్తలు వచ్చినా.. ఇది కేవలం తన కాబోయే భార్య పరిచయమే అని అప్పట్లో అతడు చెప్పాడు. కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ కావ్య రెడ్డిని కావ్యమ్మా అని పిలుస్తూ అందమైన నోట్ రాసుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.

"నా కావ్యమ్మకు.. జీవితానికి తనకంటూ ఓ అందమైన సమయం ఉంది. అది నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, నా జీవితాన్ని పాజిటివిటీతో, లెక్కలేనన్ని చిరు నవ్వులతో నింపినందుకు థ్యాంక్స్" అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాసుకొచ్చాడు.

"ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. అది ఎంగేజ్‌మెంట్ కాదు. కేవలం ఒక చిన్న ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమే. వేడుకలు ఇక ప్రారంభం కానున్నాయి. డేట్స్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. మీ ప్రేమ, సహకారమే నా ప్రపంచం" అంటూ అభిమానులు, ప్రేక్షకుల గురించి రాసుకొచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu