Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజుకు ఉన్న సమస్య ఏంటో ఇందు అడుగుతుంది. రాజు చెప్పడు. ఏదో నిజమైన పెళ్లాంలా దబాయిస్తున్నావేంటని రాజు అంటాడు.
ఆ మాటలు విన్న అపర్ణ ఏంటీ బాబు అన్నావని అడుగుతుంది.
కోరికలన్నీ తీర్చుకుంది
లేకపోతే ఏంటీ అమ్మమ్మా పెళ్లి అయిందన్నమాటే కానీ అన్యోన్యంగా ఉండనే ఉండదు. చిన్నప్పటి నుంచి ఉన్న కోరికలన్నీ తీర్చేసుకుందని ఏదోటి చెప్పి కన్‌ఫ్యూజ్ చేస్తాడు రాజు. గదిలోకి వెళ్లు అని ఇందు వార్నింగ్ ఇస్తే రాజు వెళ్తాడు. తర్వాత ఇందు నీ మెడలో గోల్డ్ చైన్ లేదు. ఏమైంది అని అపర్ణ అంటుంది. రూమ్‌లో మర్చిపోయాను అని ఇందు అంటుంది.
అది నీతో ఉంటే మీ అమ్మ నీతో ఉన్నట్లే అని చెప్పావ్. ఓసారి కనిపించకపోతే కన్నీళ్లు కూడా పెట్టుకున్నావ్. ఒకరోజు మొత్తం భోజనం కూడా చేయలేదు. అది దొరికాకే తిన్నావ్ అని అపర్ణ అంటుంది. అమ్మమ్మా అది నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసుగా. బెడ్ రూమ్‌లోనే ఉందని వెళ్లిపోతుంది ఇందు. ఆ మాటలు రాజు వింటాడు. బాబు ఇందుకు వాళ్ల అమ్మ అంటే ప్రాణం. ఆ గోల్డ్ చైన్ లేకుండా తను ఉండలేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు అని అపర్ణ అంటుంది.
ఆ గోల్డ్ చైన్ ఏమైందో కాస్తా వివరంగా అడిగి తెలుసుకో బాబు అని అపర్ణ చెప్పి వెళ్లిపోతుంది. అది ఇందు వాళ్ల అమ్మదా. తాకట్టు పెట్టకుండా ఉండాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాను అని రాజు అనుకుంటాడు. మరోవైపు ఆంటోనీకి లక్కీ తాగిస్తాడు. తల్లి గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. మీ అమ్మ అడ్రస్ చివరి నిమిషంలో మిస్ అయిందని ఆంటోనీ అంటాడు. దాంతో లక్కీ కోప్పడుతాడు.
కన్నీళ్లతో వేడుకున్న లక్కీ
మీ అమ్మ ఎక్కడున్నా పట్టుకునేవరకు నేను ఊరుకోను. మీ అమ్మను కచ్చితంగా పట్టుకుంటాను. నువ్వెళ్లి ధమ్ బిర్యానీ తీసుకురాపో అని ఆంటోనీ అంటాడు. నీకు దండం పెడతానురా. నేను సరిగా తినలేకపోతున్నానురా. నా పరిస్థితి అర్థం చేసుకో అని చేతులతో దండం పెట్టి కన్నీళ్లతో వేడుకుంటాడు లక్కీ. ఆంటోనీ తాగి పడిపోతాడు. రాజు కాల్ చేసి రమ్మంటాడు. ఆంటోనీ మొహం మీద కాలుతో తన్నాలని చూసి కోపంతా వెళ్లిపోతాడు లక్కీ.
మరోవైపు ఐశ్వర్యకు రాకేష్ కాల్ చేసి డబ్బులు అడుగుతాడు. ఇందుతో మాట్లాడాలని చెబుతాడు. ఆరోజు తనే నీతో ఇప్పిస్తానని చెబితే నేను సైలెంట్‌గా వెళ్లాని రాకేష్ అంటాడు. ఇందు వస్తే అప్పులోళ్లు అని రాకేష్ గురించి చెప్పి ఫోన్ ఇస్తుంది ఐశ్వర్య. ఇందుతో మాట్లాడిన రాకేష్ డబ్బు ఇప్పించడం గురించి అడుగుతాడు. ఇక నాకు ఓపిక లేదు. ఈ విషయాన్ని పబ్లిక్ చేస్తాను అని రాకేష్ అంటాడు.
ఒక ఆడపిల్ల పరువు పోతుంది. నేను మీకు డబ్బులు ఇస్తాను. టైమ్ ఇవ్వండని ఇందు అంటుంది. సరే రెండు రోజులు టైమ్ ఇస్తాను. అప్పుడు కూడా ఇవ్వకుంటే విషయాన్ని పబ్లిక్ చేస్తానని రాకేష్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. నీ దగ్గర ఒక్క రూపాయి లేదుగా వాడికి ఎలా డబ్బు ఇస్తావ్. నీ వల్ల నా పరువు పోయేలా ఉందని ఐశ్వర్య అంటుంది. పరువు పోయేలా చేసింది నువ్వు. ముందు జల్సాల కోసం అప్పులు చేశావ్. ఇప్పుడు మాటలు పడాల్సి వస్తుందని ఐశ్వర్యపైనే రివర్స్ అవుతుంది ఇందు.
మారిపోయిన రాజు
సరే టెన్షన్ పడకు. నీ అప్పు నేను తీరుస్తాను. ఇకనుంచి అయినా ఇలాంటివి చేయకు అని ఇందు ప్రేమగా చెబుతుంది. ఎమోషనల్‌గా నటించకు. అసలు నువ్వు అంటేనే నటన. నా రూమ్ లాక్కుని ఇప్పుడు నీతులు చెబుతున్నావా అని కోపంగా ఐశ్వర్య వెళ్లిపోతుంది. మరోవైపు రాజు మారిపోవడం గురించి లక్కీ సెటైర్లు వేస్తాడు. ఇందు తల్లి గోల్డ్ చైన్ అమ్మేయడం చాలా గిల్టీగా ఉందని రాజు అంటాడు.
లక్కీ పంచ్‌లు వేస్తాడు. అప్పుడున్న రాజు ఇప్పుడున్న రాజు చాలా మారిపోయాడు. నీ క్యారెక్టరే మారిపోయింది. లోఫర్ గాడివి అయిన నీలో చాలా మార్పులు వచ్చాయని లక్కీ అంటాడు. నేను ఎప్పుడు డబ్బు కోసమే చేస్తాను. నేను పరిస్థితులను బట్టి మారతాను. కానీ, నీ దగ్గర అలా కాదు అని రాజు అంటాడు. తర్వాత బైక్ అమ్మేసి నెక్లెస్ తీసుకొస్తానని రాజు అంటాడు. ఇది నీ సెంటిమెంట్ కదరా అని లక్కీ అంటే.. అది వాళ్ల అమ్మదిరా అని రాజు అంటాడు.
తర్వాత ఇందు ఇంటికి తనను తీసుకెళ్లడం గురించి అడుగుతాడు లక్కీ. త్వరలోనే నువ్వు ఆ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నావ్ అని చెప్పి రాజు వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు ఆలోచిస్తుంటే రాజు వచ్చి ఏమైందని అడుగుతుంది. ఐశ్వర్య గురించి చెబుతుంది ఇందు. తనను మార్చడం నీ వల్ల కాదని రాజు అంటాడు. ఇందు కోపంగా చూస్తే నీకో సర్‌ప్రైజ్ అని తాను ఇందు తల్లి కావ్య నెక్లెస్ ఇస్తాడు రాజు.
రాజు మనసున్నోడే
అది చూసి తెగ సంతోషపడుతుంది ఇందు. ఇది తాకట్టు పెట్టావుగా. మళ్లీ ఎలా తీసుకొచ్చావ్. డబ్బులు లేవనేగా నీకు ఇచ్చాను అని అడుగుతుంది ఇందు. ఈ నెక్లెస్ నీకు ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది. అందుకే దీన్ని నీకు దూరం చేయాలనిపించలేదు. సారీ ఇందాక కంగారులో ఇవ్వగానే చైన్ తీసుకెళ్లిపోయాను అని రాజు అంటాడు. అబ్బో నువ్వు కూడా మనసు పెట్టి ఆలోచిస్తావా అని ఇందు అంటుంది.
ఇప్పుడు నీలో కొంచెం మార్పు వచ్చినట్లుంది అని ఇందు అంటుంది. నేను ఎప్పుడు డబ్బు మనిషినే. తల్లి చైన్ ఎందుకు దూరం చేయడమని తీసుకొచ్చాను. ఇలా అని డబ్బులు ఇవ్వకుంటే ఊరుకునేది లేదు. పేమెంట్ టైమ్‌కి ఇవ్వాలని గట్టిగా చెప్పి వెళ్లిపోతాడు రాజు. ఏమో అనుకున్నా మంచోడే, మనసున్నోడే అని ఇందు అనుకుంటుంది.
మరోవైపు వెంకీకి ఉద్యోగం గురించి లక్ష్మీ, చలపతి మాట్లాడుకుంటారు. ఇంటికి వెంకీ వస్తాడు. ఎక్కడా ఉద్యోగం రాలేదని వెంకీ చెబుతాడు. దాంతో చలపతి షాక్ అవుతాడు. అంతలోనే శంకర్ సేటు డబ్బుల కోసం వస్తాడు. చలపతి డబ్బు ఇస్తాడు. మరోవైపు ఇంటికి పంతులును పిలిపించి రాజు, ఇందుల ఫస్ట్ నైట్‌కు ముహుర్తం పెట్టిస్తుంది అపర్ణ.
రేఖకు షాక్
అదే విషయం రేఖ అడిగితే చెబుతుంది. దాంతో రేఖ షాక్ అవుతుంది. రేఖకు ఇందు శోభనంతో షాక్ ఇస్తుంది అపర్ణ. ఇందు కూడా అవాక్కవుతుంది. రాజు మాత్రం సంతోషిస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

