Dailyhunt
Brahmamudi Promo: బ్రహ్మముడి- రేఖకు మరో పెద్ద షాక్- ఇందు సంతకం చెల్లదన్న లాయర్- బతికే ఉన్న రాజు తల్లి- వారసుడిగా ఎంట్రీ!

Brahmamudi Promo: బ్రహ్మముడి- రేఖకు మరో పెద్ద షాక్- ఇందు సంతకం చెల్లదన్న లాయర్- బతికే ఉన్న రాజు తల్లి- వారసుడిగా ఎంట్రీ!

Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో హాస్పిటల్‌లో రాజును చూసిన ఒకప్పుడు రాజ్, కావ్యల దగ్గర పనిచేసిన శ్రుతి చూస్తుంది.

రాజ్ సర్‌లా ఉన్నాడని ఫాలో అవుతూ ఇంటిదాకా వెళ్తుంది. రాజ్‌తో మాట్లాడుతుంది శ్రుతి. కానీ, రాజ్ అదంతా పట్టించుకోకుండా ఇంట్లో తన తండ్రి ఉంటాడు, మాట్లాడమని వెళ్లిపోతాడు.

దుగ్గిరాల వారసుడు

ఇంట్లోకి వెళ్లిన శ్రుతి చలపతి, లక్ష్మీలను రాజ్ గురించి అడిగితే.. తమ కొడుకుని చెబుతారు. మీరు అబద్ధం చెపుతున్నారు అని శ్రుతి నిలదీయడంతో కొడుకు గతం గురించి ఏమైనా తెలుస్తుందన్న నమ్మకంతో నిజం చెబుతారు. రాజ్ శ్రీశైలంలో దొరికాడని చలపతి, లక్ష్మీ చెబుతారు. దాంతో నేను అనుకున్నది నిజమే, రాజ్ ఆ ఇంటి రక్తమే, దుగ్గిరాల ఇంటి వారసుడు అని శ్రుతి చెబుతుంది.

దాంతో షాక్ అయిన చలపతి, లక్ష్మీ తాము ఇన్నాళ్లు పెంచింది అంత గొప్పింటి బిడ్డనా అని ఆశ్చర్యపోతారు. దుగ్గిరాల కుటుంబం గురించి తెలియని వారు లేరని, వారికి ఎన్నో ఆస్తులు ఉన్నాయని, శ్రీశైలంలో జరిగిన ప్రమాదంలో రాజ్, కావ్య చనిపోయారని, అప్పటి నుంచి రేఖ ఆస్తినంతా తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తుందని శ్రుతి చెబుతుంది.

రాజ్‌కు ఒక్క అక్క, అపర్ణ కూతురు రేవతి ఉండేదని, తనకు పుట్టిన కొడుకు పేరు స్వరాజ్ అని శ్రుతి చెబుతుంది. అచ్చం మేనమామ పోలికలతో రాజు పుట్టాడని శ్రుతి చెబుతుంది. దుగ్గిరాల ఇంట్లో అంతా అమ్మాయిలే అని, ఆ ఆస్తికంతా వారసుడు మేనల్లుడు రాజు అని శ్రుతి చెబుతుంది. తర్వాత రాజు దుగ్గిరాల ఇంటికి వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

వేలిముద్ర వేసిన ఇందు

మరోవైపు అపర్ణ ఇంటికి లాయర్ వస్తాడు. రేఖ పిలిపిస్తుంది. తనకు ఆస్తి వచ్చేలా చేయించిన పేపర్స్‌పై ఇందును వేలి ముద్రలు వేయమంటుంది రేఖ. ఇందు కూడా సంతకం చేసేందుకు రెడీ అవుతుంది. కానీ, వద్దని అపర్ణ వారిస్తుంది. ఇందు ఏం చేస్తున్నావ్ అని అపర్ణ అరుస్తుంది. వేలిముద్ర వేస్తున్నాను అని ఇందు చెబుతుంది. వేలిముద్రలు పెడితే రేఖ ఆటలకు అంతు ఉండదే అని మొరపెట్టుకుంటుంది.

నాకు ఆస్తి కన్నా నువ్వు, సుబ్బు ప్రాణాలతో ఉండటం ముఖ్యమని ఇందు అంటుంది. ఆ మాత్రం భయం ఉండాలని రేఖ అంటుంది. ఇందు వేళ్లి ఆస్తి పేపర్స్‌పై వేలి ముద్రలు వేస్తుంది. దాంతో భ్రమరాంబ, రేఖ, భూషణ్ అంతా ఆస్తి తమకు వచ్చినట్లే అని సంతోషిస్తారు. ఇక తమ అప్పులన్నీ తీరిపోతాయని, ఆ చక్రి అంతు చూడాలని మురిసిపోతారు.

ఇన్నాళ్లు ఎదురుచూసినందుకు, మన నగలు పోయినందుకు చివరికి మంచి ఫలితమే దక్కిందని భ్రమరాంబ సంబరపడుతుంది. ఇదంతా నిజం కాదేమే భ్రమనేమో భ్రమరా అని శేషు అంటాడు. ఎప్పుడు అపశకునపు మాటలే మాట్లాడతవా, మంచి మాటలు మాట్లాడవా, ఇందు సంతకం పెట్టాకా ఇంకేం సమస్యలు ఉంటాయని భర్త శేషుపై అరుస్తుంది భ్రమరాంబ.

ఇందు సంతకం చెల్లదు

తర్వాత ఇందును నీకు అసలు బుద్ధి ఉందా. నువ్వు ఏం చేశావో నీకు అర్థం అవుతుందా. సంతకం ఎందుకు పెట్టావని అపర్ణ నిలదీస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. నేను పెట్టిన సంతకం చెల్లదు కదా అని ఇందు అంటుంది. అది ఎలా అని అపర్ణ, సుభాష్, స్వాతి షాక్ అవుతారు.

ఇందు వేసిన వేలిముద్రలు ఉన్న పేపర్స్‌తో మరో లాయర్‌ దగ్గరికి వెళ్తారు రేఖ, భూషణ్. అవి చూపించి ఆస్తి ఇక మాకు దక్కినట్లేగా అని రేఖ అంటుంది. అవి చూసిన లాయర్ నో.. నో.. ఆస్తి మీ పేరు మీద రాదు అని అంటాడు. దాంతో ఎందుకు రాదు అని రేఖ, భూషణ్ షాక్ అవుతూ అడుగుతారు. ఇందు వేసిన వేలిముద్ర సంతకం చెల్లదని లాయర్ అంటాడు. దాంతో మరింత షాక్ అవుతారు రేఖ, భూషణ్.

అలా రేఖకు మరోసారి పెద్ద షాక్ తగులుతుంది. మరోవైపు హాస్పిటల్‌లో రాజు ట్రీట్‌మెంట్ చేయిస్తున్న తన తల్లి రేవతికి అని తెలుస్తుంది. అంటే, రాజు తల్లి బతికే ఉందని తెలుస్తుంది. రేవతి ద్వారానే దుగ్గిరాల ఇంటికి రాజు వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని అర్థం అవుతోంది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu